AP Speaker Ayyanna Patrudu: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్‌గా సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఎన్నికయ్యారు.. అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా స్పీకర్‌గా ఎన్నికైనట్టు శాసన సభలో ప్రకటించారు ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. దీంతో.. ఏపీ 16వ అసెంబ్లీ స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు ఎన్నికయ్యారు.. ఇక, ఆ తర్వాత అయ్యన్నపాత్రుడుని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు అచ్చెన్నాయుడు, సత్యకుమార్ యాదవ్.. స్పీకర్ స్థానంలో కూర్చుండబెట్టారు. కాగా, శుక్రవారం సాయంత్రం 5 గంటలకు స్పీకర్ ఎన్నికకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ ముగిసిన విషయం విదితమే కాగా.. కూటమి నేతలు అయ్యన్నపాత్రుడి తరపున నామినేషన్ దాఖలు చేశారు.. ఇక, ఒకే నామినేషన్ దాఖలు కావడంతో అయ్యన్నపాత్రుడి ఎన్నిక ఏకగ్రీవమైపోయింది..
Read Also: Today Gold Price: గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు! అస్సలు ఊహించరు
కాగా, అనకాపల్లి జిల్లా, నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు అయ్యన్నపాత్రుడు.. ఆయనకు నాలుగు దశాబ్దాలకు పైగా రాజకీయ అనుభవం ఉంది.. 1983లో తెలుగుదేశం ఆవిర్భావంతో రాజకీయాల్లోకి ప్రవేశించిన అయ్యన్నపాత్రుడు. ఏడుసార్లు ఎమ్మెల్యేగా.. ఒకసారి ఎంపీగా గెలిచారు.. ఇప్పటి వరకూ ఐదు ప్రభుత్వాల్లో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.. మంత్రిగా సాంకేతిక విద్య, క్రీడా, రహదారులు భవనాలు, అటవీ, పంచాయతీ రాజ్ వంటి కీలక శాఖల బాధ్యతలు నిర్వహించారు.. 1983 నుంచి ఇప్పటి వరకూ 10సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో, 2 సార్లు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేశారు.. ఈ సార్వత్రిక ఎన్నికల్లోనూ నర్సీపట్నం అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగి ఘన విజయం సాధించారు అయ్యన్నపాత్రుడు.