Kakatiya Hills Land Case: మాదాపూర్ కాకతీయ హిల్స్ భూ వివాదం.. అయ్యన్న ఇన్ఫ్రా ఎండీ శ్రీధర్ అరెస్ట్!
- కాకతీయ హిల్స్‌లో భూ వివాదం కేసు
- అయ్యన్న ఇన్ఫ్రా ఎండీ శ్రీధర్ అరెస్ట్
- శ్రీధర్‌పై చీటింగ్, ఫోర్జరీ కేసులు నమోదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ayyanna Infra MD P Sridhar Arrested: హైదరాబాద్‌లోని మాదాపూర్ కాకతీయ హిల్స్‌లో చోటుచేసుకున్న భూ వివాదం కేసులో అయ్యన్న ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) పి. శ్రీధర్‌ను మాదాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. బాధిత భూయజమానుల ఫిర్యాదు మేరకు ఆయనపై చీటింగ్, ఫోర్జరీ కేసులు నమోదు చేసిన పోలీసులు.. విచారణ అనంతరం రిమాండ్‌కు తరలించారు. పోలీసులు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి…
కాకతీయ హిల్స్ ప్రాంతంలో ఏడుగురు భూయజమానులకు చెందిన సుమారు 3,371 గజాల స్థలాన్ని పి. శ్రీధర్ డెవలప్మెంట్ కోసం తీసుకున్నారు. భూయజమానులు, డెవలపర్ మధ్య కుదిరిన ప్రాథమిక ఒప్పందం ప్రకారం.. ఆ స్థలంలో ఎనిమిది అంతస్తుల భవనం నిర్మించేందుకు పరస్పర అంగీకారం జరిగింది. అయితే అనంతరం మరో రెండు అదనపు అంతస్తుల నిర్మాణానికి అనుమతులు పొందేందుకు శ్రీధర్ ప్రయత్నించిచారు. ఈ క్రమంలో అమెరికాలో నివసిస్తున్న నలుగురు భూయజమానుల సంతకాలను నకిలీగా సృష్టించి, వారి అనుమతి లేకుండానే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) నుంచి అదనపు అంతస్తుల నిర్మాణానికి అనుమతులు పొందారు.
Also Read
- Gandhi Jayanti: బాపూఘాట్లో మహాత్ముడికి సీఎం రేవంత్, గవర్నర్ ఘన నివాళులు..
- FASTag నిబంధనల్లో కీలక మార్పులు.. వారికి గుడ్‌న్యూస్..
- Lal Bahadur Shastri Jayanti: నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం.. 'జై జవాన్ జై కిసాన్' రూపశిల్పి శాస్త్రి జీ..
- Sugar Stock Limit: షుగర్ వ్యాపారులకు షాక్.. నిల్వలపై కేంద్రం కొత్త నిబంధనలు
ఈ విషయం తెలుసుకున్న భూయజమానులు వెంటనే జీహెచ్ఎంసీ అధికారులతో పాటు పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు ఆధారంగా విచారణ ప్రారంభించిన పోలీసులు.. అదనపు అనుమతులకు సంబంధించిన అసలు పత్రాలను సమర్పించాలని శ్రీధర్‌ను కోరారు. అయితే ఆయన సంబంధిత ఒరిజినల్ డాక్యుమెంట్లను అందించలేదు. దీంతో సంతకాల ఫోర్జరీ, మోసం (చీటింగ్) తదితర ఆరోపణలపై కేసులు నమోదు చేసిన మాదాపూర్ పోలీసులు.. పి. శ్రీధర్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. అనంతరం కోర్టులో హాజరుపరి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన మాదాపూర్ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారగా.. ఒప్పందాల విషయంలో నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Gandhi Jayanti: బాపూఘాట్లో మహాత్ముడికి సీఎం రేవంత్, గవర్నర్ ఘన నివాళులు..
-
FASTag నిబంధనల్లో కీలక మార్పులు.. వారికి గుడ్‌న్యూస్..
-
Lal Bahadur Shastri Jayanti: నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం.. ‘జై జవాన్ జై కిసాన్’ రూపశిల్పి శాస్త్రి జీ..
-
Vivo T5 Lite 5G, T5 Pro 5G: వివో T5 Lite 5G, వివో T5 Pro 5G కొత్త RAM, స్టోరేజ్ వేరియంట్లు విడుదల.. ధరలు, ఫీచర్లు ఇవే
-
Harbhajan Singh: అతడు మరింత పదునెక్కుతున్నాడు.. ఈ వయసులోనే ఆ ఘనతలు అసాధ్యం!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?