బొట్టు పెట్టుకోవడం మన దేశ సనాతన సాంప్రదాయం. మన అమ్మమ్మలు, అమ్మలు.. పెద్ద కుంకుమ బొట్టు పెట్టుకుని నిండుగా కనిపించేవాళ్లు. కానీ కాలం మారింది బొట్టు సైజ్ తగ్గింది. కుంకుమను.. స్టిక్కర్స్ రీప్లేస్ చేశాయి. అమ్మాయిలు సాంప్రదాయ దుస్తులు ధరించినప్పుడల్లా.. లుక్ పూర్తి కావాలంటే చక్కని, అందమైన బొట్టు పెట్టుకోవాల్సిందే. ఎందుకంటే బొట్టు పెట్టుకుంటే.. ముఖం
నిండుగా కనిపిస్తుంది. కేవలం అందంగా కనిపించడానికి.. సంప్రదాయం కోసం బొట్టు పెట్టుకుంటారని చాలా మంది అనుకుంటారు. అయితే ఆడవాళ్లు బొట్టు పెట్టుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.
Also Read : Perfumes : మగవారు ఆ టైమ్‌లో ఈ పెర్ఫ్యూమ్స్ వాడితే.. ఆడవారికి చాలా ఇష్టమట..
మహిళలు తమ బొట్టు ధరించే.. స్థలాన్ని అజ్ఞా చక్రం అంటారు.. ఇది మానవ శరీరంలో అరవ, అత్యంత శక్తివంతమైన చక్రంగా అభివర్ణిస్తారు. బొట్టు పెట్టుకునేటప్పుడు ఈ పాయింట్ ను రోజుకు చాలా సార్లు నొక్కుతారు. మానవ శరీరంలో వేల సంఖ్యలో నాడులుంటాయి. వీటన్నింటికీ కేంద్ర స్థానం అజ్ఞా చక్రం. అంటే కనుబొమ్మల మధ్య స్థానం అని అర్థం. ఈ స్థానంలోంచి ప్రాణశక్తి కిరణాలు ప్రసారం అవుతాయి. ఈ స్థానంలో కళ్లు, మెదడు, పిట్యూటరీ గ్రంధికి సంబంధించిన నాడులు ఉంటాయి. మహిళలు బొట్టు పెట్టుకునేటప్పుడు అజ్ఞాచక్రంపై ఒత్తుతూ ఉంటారు. స్టిక్కర్ ధరించేటప్పుడు కూడా దాన్ని సర్థడం, సరిగ్గా పెట్టుకోవడం, తీయడం లాంటివి చేస్తుంటారు.. దీని వల్ల అజ్ఞాచక్రం వద్ద ఒత్తిడి పడుతుంది. దీంతో నాడులు ఉత్తేజం అవుతాయి. పురుషులు బొట్టు పెట్టుకోలేరు.. కాబట్టి.. ఆ స్థానంలో కుంకుమ పెట్టుకున్నా.. 100 సార్లు ఆ పాయింట్ ను ప్రెస్ చేసినా అనేక ప్రయోజనాలు పొందవచ్చని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు.
Also Read : LSG vs RR : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్
బొట్టు పెట్టుకోవడం వల్ల కలిగే లాభాలు :
1. తలనొప్పి నుంచి ఉపశమనం
2. సైనస్ లను క్లియర్ చేస్తుంది
3. దృష్టిని, కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
4. మీ చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది.
5. డిప్రెషన్ ను నివారిస్తుంది.
6. వినికిడి శక్తిని మెరుగుపరుస్తుంది.
7. జ్ఞాపకశక్తిని, ఏకాగ్రతను పెంచుతుంది.
8. ఒత్తిడితో కూడిన మైగ్రేన్ తలనొప్పిని తగ్గిస్తుంది.
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించే ముందు సంబంధిత నిపుణుల సలహాలను తీసుకోవాల్సిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు Ntvtelugu.com బాధ్యత వహించదు.