Ayodhya Ram Temple: రామ మందిరంలో 105 సార్లు కానుకలు కొట్టేశారు.. సుప్రీంకోర్టుకు సిట్ సంచలన నివేదిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ayodhya Ram Temple: అయోధ్య రాముడి గుడిలో కానుకల లెక్కింపు దగ్గర దాదాపు 105 సార్లు అక్రమాలు జరిగినట్లు సిట్ (SIT) సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికలో స్పష్టం చేసింది. హుండీ లెక్కింపు గదిలో సీసీటీవీ దృశ్యాలను క్షుణ్ణంగా పరిశీలిస్తే.. ఎవరికీ చెప్పకుండా, ఎలాంటి అనుమతి లేకుండా డబ్బులను పక్కన పెట్టడం లేదా దాచడం లాంటివి సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయని దర్యాప్తు బృందం వెల్లడించింది. ఈ హుండీ దొంగతనాల వ్యవహారంలో ఇప్పటివరకు ఏకంగా 173 మంది సాక్షులను విచారించి వారి స్టేట్మెంట్లు నమోదు చేశామని, సెప్టెంబర్ 25 నాటికల్లా కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేస్తామని సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది. దర్యాప్తు సమయంలో కొంతమంది అనుమానితులను కూడా గుర్తించామని, ఈ అక్రమాలు అసలు ఎవరెవరు చేశారు? ఎన్నిసార్లు చేశారనే విషయాలపై పూర్తి వివరాలు రాబడుతున్నామని సిట్ వివరించింది.
అయితే, సోషల్ మీడియాలోనూ వార్తల్లోనూ జోరుగా ప్రచారమైన వెండి ఇటుకలు, రాముడి పాదుకల మాయం వార్తలపై సిట్ క్లారిటీ ఇచ్చింది. భక్తులు సమర్పించిన 200 కిలోల వెండి ఇటుకలు, 38.288 కిలోల వెండి, వెండి హారం, రాముడి చరణ పాదుకలు, రామచరితమానస్ కాపీల దానాలకు సంబంధించి ఎలాంటి అక్రమాలు జరగలేదని ప్రాథమిక విచారణలో తేల్చింది. దీనికోసం సంబంధిత వ్యక్తులను ప్రశ్నించడమే కాకుండా రికార్డులన్నింటినీ కూపీ లాగామని, అందులో ఎలాంటి తేడాలు లేవని తేల్చి చెప్పింది. మరోవైపు, రసీదులు లేకుండా వచ్చిన 86 రకాల విలువైన కానుకలను కూడా అధికారులు గుర్తించారు. టీసీఎస్ (TCS) సాఫ్ట్వేర్ ద్వారా రసీదులు పొందిన మరో 803 విలువైన కానుకలను పరిశీలించి, అవి సరిగ్గా ఉన్నాయని ధృవీకరించారు. ట్రస్ట్ రికార్డులను, ఎస్బిఐ (SBI) లాకర్లలో దాచిన కానుకలను స్వయంగా వెళ్లి భౌతికంగా తనిఖీ చేశారు. ఇక వెండిగా భావిస్తున్న సుమారు 944.411 కిలోల తెల్లటి లోహాన్ని కరిగించి అసలు విలువ తేల్చేందుకు ‘సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా’కు ట్రస్ట్ పంపగా, దానికి సంబంధించిన రికార్డులను కూడా సిట్ బృందం పరిశీలించింది. ఈ వివరాలన్నింటినీ పరిశీలించిన సుప్రీంకోర్టు, సిట్ నివేదికను రికార్డుల్లోకి తీసుకుంది. సిసిటీవీ ఫుటేజ్, బ్యాంక్ లాకర్లు, ట్రస్ట్ రికార్డుల ఆధారంగా సిద్ధం చేసిన ఈ నివేదిక తర్వాత, సెప్టెంబర్ 25న దాఖలయ్యే ఛార్జ్‌షీట్‌లో మరిన్ని సంచలన నిజాలు బయటపడే అవకాశం ఉంది.
Also Read
- Reliance Foundation: తుఫాన్ బాధిత మత్స్యకారులకు అండగా రిలయన్స్ ఫౌండేషన్.. పడవల వెలికితీతకు చర్యలు..
- Karnataka: పెళ్లాం పుట్టింటికి వెళ్తోందని కక్ష.. భార్య, అత్తతో పాటు అత్తగారింటికి చెందిన ఏడుగురి హత్య
- DGP CV Anand: "పోలీసుల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యం".. తెలంగాణలో ‘ఫిట్ కాప్’ యాప్ ప్రారంభం
- Vijayasai Reddy: జగన్‌ను వదిలి వెళ్తానని కలలో కూడా అనుకోలేదు.. విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..
తాజావార్తలు
-
Illegal Mining : అక్రమ మైనింగ్‌కు చెక్.. ఏపీ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు
-
OBC Reservation : ఓబీసీ క్రీమీలేయర్‌పై సుప్రీం కీలక తీర్పు.. ఎవరికి వర్తిస్తుంది.?
-
Reliance Foundation: తుఫాన్ బాధిత మత్స్యకారులకు అండగా రిలయన్స్ ఫౌండేషన్.. పడవల వెలికితీతకు చర్యలు..
-
Anaswara Rajan: బన్నీ మలయాళ హీరో అనుకున్నా.. ఆ హీరోయిన్ క్రేజీ కామెంట్స్ వైరల్!
-
Karnataka: పెళ్లాం పుట్టింటికి వెళ్తోందని కక్ష.. భార్య, అత్తతో పాటు అత్తగారింటికి చెందిన ఏడుగురి హత్య
ట్రెండింగ్
-
The Traitors Telugu: “ది ట్రైటర్స్” తెలుగు సీజన్ 1 విజేతలుగా శ్రావ్య వర్మ, స్వీకర్ అగస్తి.. రూ.42.77 లక్షల ప్రైజ్ మనీ సొంతం..!
-
Maxwell Engineering Solutions IPO Listing: 90% ప్రీమియంతో లిస్టింగ్..ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
-
IPL 2027: సన్‌రైజర్స్‌తో సీఎస్కే భారీ ట్రేడ్ డీల్.. లివింగ్‌స్టోన్‌తో పాటు మరో ఆల్‌రౌండర్ జట్టులోకి..?
-
Andre Russell: 10 వేల పరుగులు, 500 వికెట్లతో టీ20 క్రికెట్లో ఆండ్రీ రస్సెల్ వరల్డ్ రికార్డు..!
-
IPL 2027-DC: గంగూలీ టార్గెట్ ఆ ఇద్దరు విదేశీ స్టార్లే.. ఢిల్లీ క్యాపిటల్స్ వేలం ప్లాన్ లీక్!