Axar Patel: విజయం సాధించిన లేని ఆనందం.. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌కు భారీ జరిమానా..!
- పంజాబ్ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుత విజయం
- స్లో ఓవర్‌రేట్ కారణంగా అక్షర్ పటేల్‌కు రూ.12 లక్షల జరిమానా
- ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆర్టికల్ 2.22 ప్రకారం బీసీసీఐ చర్యలు
- ఈ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు తొలి స్లో ఓవర్‌రేట్ తప్పిదం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Axar Patel: ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్‌పై అద్భుత విజయం సాధించినప్పటికీ ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్‌కు బీసీసీఐ షాక్ ఇచ్చింది. ధర్మశాలలో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్‌రేట్ కారణంగా అక్షర్ పై బీసీసీఐ జరిమానా విధించింది. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌లోని ఆర్టికల్ 2.22 ప్రకారం ఈ సీజన్లో ఢిల్లీ జట్టుకు ఇది తొలి తప్పిదం కావడంతో అక్షర్ పటేల్‌కు రూ.12 లక్షల ఫైన్ విధించారు అధికారులు.
ఐపీఎల్ 2026 సీజన్లో స్లో ఓవర్‌రేట్ సమస్య తరచుగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే పలువురు కెప్టెన్లు బీసీసీఐ నుంచి శిక్షలు ఎదుర్కొన్నారు. శ్రేయస్ అయ్యర్, శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యా వంటి కెప్టెన్లపై కూడా చర్యలు తీసుకున్నారు. గతంలో ఒకే జట్టు పదేపదే స్లో ఓవర్‌రేట్‌కు పాల్పడితే కెప్టెన్‌పై సస్పెన్షన్ విధించే నిబంధన ఉండేది. అయితే 2025 నుంచి ఆ నియమాన్ని బీసీసీఐ రద్దు చేసింది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ అసాధారణ పోరాటంతో 211 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. కెప్టెన్ అక్షర్ పటేల్ జట్టును ముందుండి నడిపిస్తూ కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
Also Read
అక్షర్ పటేల్ కేవలం 30 బంతుల్లో 56 పరుగులు చేసి ఈ సీజన్లో తన అత్యుత్తమ ఇన్నింగ్స్ నమోదు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో ఎనిమిది ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. ఐపీఎల్లో 20 ఇన్నింగ్స్‌ల తర్వాత అక్షర్‌కు ఇది తొలి హాఫ్ సెంచరీ కావడం విశేషం. డేవిడ్ మిల్లర్ కూడా 28 బంతుల్లో 51 పరుగులు చేసి ఢిల్లీ విజయానికి కారకుడయ్యాడు. ఆ తర్వాత యువ ఆటగాళ్లు అశుతోష్ శర్మ 24 పరుగులు చేయగా, మాధవ్ తివారి 18 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. పెనల్టిమేట్ ఓవర్ చివరి బంతికి ఔకిబ్ నబీ దార్ యశ్ ఠాకూర్ బౌలింగ్‌లో భారీ సిక్సర్ కొట్టడంతో ఢిల్లీ విజయాన్ని ఖాయం చేసుకుంది.
మ్యాచ్ అనంతరం అక్షర్ పటేల్ జట్టు బ్యాటింగ్ భాగస్వామ్యాలను ప్రశంసించాడు. ఈ సీజన్లో మిడిల్ ఆర్డర్ నిలకడగా రాణించలేకపోయినా, ఈ మ్యాచ్‌లో అందరూ బాధ్యతగా ఆడారని తెలిపాడు. డేవిడ్ మిల్లర్‌తో నా భాగస్వామ్యం జట్టును గాడిలో పెట్టింది. ఆ తర్వాత అశుతోష్ శర్మ, మాధవ్ తివారి వంటి యువ ఆటగాళ్లు అద్భుతంగా మ్యాచ్‌ను ముగించారని అక్షర్ పేర్కొన్నాడు.
తాజావార్తలు
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
-
Karnataka: హృదయ విదారక ఘటన.. తల్లి శవంపై ఏడుస్తూ కనిపించిన రెండేళ్ల చిన్నారి
-
OTR: కాంగ్రెస్ కంచుకోటలో గ్రూప్ వార్.. క్యాడర్లో పెరుగుతున్న అసంతృప్తి..
-
SJ Suryah Bodhi: ‘జైలర్ 2’ నుంచి ఎస్.జే.సూర్య ఊరమాస్ ఎంట్రీ.. అనిరుధ్ బీజీఎమ్ నెక్స్ట్ లెవెల్ అంతే!
-
Etela Rajender : ధరణి పేరుతో పేద రైతులకు తీవ్ర అన్యాయం
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!