టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ తండ్రయ్యాడు. అక్షర్ సతీమణి మేహా పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని అక్షర్ మంగళవారం (డిసెంబర్ 24) సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. కుమారుడికి భారత జెర్సీ వేసి తీసిన ఫొటోను షేర్ చేశాడు. డిసెంబర్ 19న తనకు కొడుకు పుట్టాడని, హక్ష్ పటేల్ అని పేరు కూడా పెట్టినట్లు అక్షర్ వెల్లడించాడు. అక్షర్‌కు ఫాన్స్ విషెష్ తెలియజేస్తున్నారు. అక్షర్ పటేల్ ప్రస్తుతం భారత జట్టుకు దూరంగా…