అవకాడో అనేది మనదేశంలో పంట కాదు.. ఇది మెక్సీకో పంట.. కానీ దీనిని తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉండటంతో వీటిని ఇక్కడ కూడా సాగు చేస్తున్నారు..ప్రపంచంలో ఉండే మొత్తం అవకాడోలో సగం కేవలం అమెరికా ప్రజలు తింటారు. అవకాడో పియర్ పండు మాదిరిగా మరియు గుడ్డు ఆకారంలో లాగా కనిపిస్తుంది. దీనిలో కేవలం ఒకటే విత్తనం ఉంటుంది. ఈ విత్తనం చుట్టూ పండు యొక్క గుజ్జు ఉంటుంది. దీని యొక్క చర్మం చూడటానికి కొంచెం కఠినంగా ఉన్నా కొంచెం తియ్యగా ఉంటుంది.. వెన్నలాగా ఉంటుంది.. అందుకే ఎక్కువ మంది దీన్ని పండించడానికి ఆసక్తి చూపిస్తున్నారు..
ఈ అవకాడో 66 నుండి 67 అడుగుల ఎత్తు పెరుగుతుంది. 12 సెంటీమీటర్ల నుండి 25 సెంటీమీటర్ల పొడవు ఆకులు ఐదు నుండి పది మీటర్లు వెడల్పు పువ్వు ఏడు నుండి ఎనిమిది అంగుళాల పొడవు గల కాయను కలిగి ఉంటుంది. అవకాడో వ్యాపారపరంగా మంచి విలువ గల పంట. ఈ పంటకు వాతావరణం గల ప్రపంచంలోని అన్ని శీతోష్ణ ప్రాంతాల్లో ఈ పంటను పండిస్తారు.. ఇప్పటివరకు ఇక్కడ మన చుట్టూ ఎక్కడ పండించలేదు.. పోర్చుగీస్, మొరొకొ, క్త్రెతె, లెవాంట్, దక్షిణాఫ్రికా, కొలంబియా, చిలీ, వియత్నాం, ఇండోనేషియా, శ్రీలంక, దక్షిణ భారతదేశం, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్, మలేషియా, కరేబియాన్, మెక్సికో, హవాయి వంటి దేశాల్లో ఎర్రటి సారవంతమైన నేలల్లో ఎక్కువగా పండిస్తున్నారు..
ఈ మొక్క విత్తనం నాటిన నాలుగు నుండి ఆరు సంవత్సరాలకు వెన్న చెట్లు కోతకు వస్తాయి. ఇవి చెట్టున ఉన్నప్పుడే మగ్గుతాయి. కానీ వాణిజ్యంగా పండిరచే వారు వీటిని పచ్చిగానే ఉన్నప్పుడు కోసి 3.3 నుండి 5.50సెం.మీ మగ్గడం కోసం భద్రపరుస్తారు..మన రాష్ట్రాల్లో ఇప్పటివరకు ఈ పంటను ఎవరూ వేయలేదు.. వీటి గురించి మరింత సమాచారం తెలుసుకోవాలంటే దగ్గరలొని వ్యవసాయ నిపునులను అడిగి తెలుసుకోవడం మంచిది..