Avinash Group Of Institution Telangana First Year Results: ఈ సాయంత్రం అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ సికింద్రాబాద్ బ్రాంచ్‌లో జరిగిన మీడియా సమావేశంలో కాలేజ్ చైర్ పర్సన్ డాక్టర్ అవినాష్ బ్రహ్మదేవర, డైరెక్టర్ సంతోష్ బుద్ధ, కే. పట్టాభిరామ్, డీన్ ఎకెడమిక్స్ – అవినాష్ విద్యాసంస్థలు శ్రీమతి సుశీల కాండూరి మరియు రాష్ట్రంలో మొదటి ర్యాంకులు సంపాదించిన ఎల్‌బీ నగర్/కూకట్ పల్లి అవినాష్ కళాశాల ప్రధానోపాధ్యాయులు శ్రీమతి నీరజ లోకసాని, శుభా సేత్ మరియు అవినాష్ కళాశాలకు చెందిన ఇతర ప్రధానోపాధ్యాయురాళ్లు పాల్గొన్నారు.
అవినాష్ గ్రూప్ ఆఫ్ ఇన్స్‌టిట్యూషన్స్ 500కు పైగా ఫ్యాకల్టీ.. 15000కు పైగా విద్యార్థులతో.. 10 క్యాంపస్‌లు, 10 సంవత్సరాల సమర్థత, 25కు పైగా కోర్సులు, 98% ప్లేస్‌మెంట్స్‌తో కామర్స్ విద్యకు నెం.1 విద్యాసంస్థగా నిలిచిన అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ నేడు ప్రకటించిన తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలలో సత్తా చాటింది. ఎల్‌బీ నగర్ బ్రాంచ్ విద్యార్థి రింకూ కుమావత్ 500 మార్కులకు 495.. కూకట్ పల్లి బ్రాంచ్ విద్యార్థి పీ. లిఖిత 1000 మార్కులకు 987 అద్భుతమైన మార్కులతో తెలంగాణ రాష్ట్రంలో స్టేట్ ఫస్ట్ ర్యాంకులు సాధించారు. ఈ సందర్భంగా శ్రీ అవినాష్ బ్రహ్మదేవర మాట్లాడుతూ.. విద్యార్థులు తమ భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను అత్యంత శ్రద్ధతో పాటు పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమౌతుందని ప్రోత్సహించారు. చక్కటి మార్కులు, స్టేట్ ర్యాంకులు సంపాదించిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఎంతగానో అభినందించారు.
విద్యారంగంలో మేటి సంస్థగా రుజువు చేసుకున్న అవినాష్ విద్యా సంస్థ.. ఈ సంస్థలలో చదువుకుంటున్న విద్యార్థుల విద్యా ప్రగతికై కృషి చేసే మార్గమున తారాజువ్వలా ముందుకు ప్రయాణం చేయుచున్నది. విద్యార్థుల యొక్క చక్కటి భవిష్యత్తునుద్దేశించి అవినాష్ విద్యా సంస్థలు నిరంతరం కృషి సలుపుతాయని, అవినాష్ విద్యాసంస్థల ఛైర్మన్ డాక్టర్ అవినాష్ బ్రహ్మదేవర తెలియజేశారు.