Avatar 2 : విజువల్ వండర్ అవతార్ 2 ఈ నెల 16న థియేటర్లకు వచ్చింది. జేమ్స్ కామెరూన్ దర్శకనిర్మాతగా వ్యవహరించిన సినిమా తొలి రోజునుంచే రికార్డులను నమోదు చేసుకుంటూ బాక్సాఫీసు వద్ద దూసుకుపోతుంది. టెక్నాలజీ పరంగా ప్రపంచ సినిమాను మరో అడుగు ముందుకు వేయించింది. 2D .. 3D ఫార్మేట్ లలో సినిమా విడుదలైంది. ‘అవతార్ ది వే ఆఫ్ వాటర్’ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు పోటెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే 5వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 46 మిలియన్ డాలర్లు వచ్చాయి. ఇలా మొత్తంగా ఐదు రోజుల్లో 497.1 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. అంటే ఇండియన్ కరెన్సీలో రూ. 4110.25 కోట్లు వసూలు చేసి ఎన్నో రికార్డులను క్రియేట్ చేసింది. విజువల్ వండర్‌గా రూపొందిన ఈ మూవీకి ఇండియా వ్యాప్తంగా భారీ రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా దీనికి తొలి రోజు రూ. 41 కోట్లు, రెండో రోజు రూ. 45 కోట్లు, మూడో రోజు రూ. 43.40 కోట్లు, నాలుగో రోజు రూ. 14 కోట్లు, 5వ రోజు రూ. 15 కోట్లు వచ్చాయి. ఇలా 5 రోజుల్లో రూ. 161.30 కోట్లు నెట్‌తో పాటు రూ. 202.75 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజునే 10 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. 3 రోజుల్లోనే 38 కోట్లను రాబట్టిన ఈ సినిమా, 5వ రోజుతో 47 కోట్ల వసూళ్లను సాధించింది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి, సంక్రాంతి వరకూ పోటీగా నిలిచే స్థాయి సినిమాలేవీ లేవు. అందువలన ‘అవతార్ 2’ తీరిగ్గా తన హవాను కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.