AV Ranganath : హైడ్రా బ్రెయిన్ స్టోర్మ్ సమావేశంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏవీ రంగనాథ్ మాట్లాడుతూ.. ఎఫ్‌టీఎల్‌లో ఉన్న నిర్మాణాలన్నీ కూల్చివేసి చెరువులు పరిరక్షించడం హైడ్రా ఉద్దేశం కాదన్నారు. చెరువులను పునరుద్దరించాలంటే ఇళ్లను కూల్చాల్సిన అవసరం లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఇకనుంచి చెరువులోకి కొత్త నిర్మాణాలు రాకుండా అడ్డుకోవడమే మా లక్ష్యమని ఆయన తెలిపారు. చెరువులో నీటి విస్తీర్ణం, సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్ లు, విలేజ్ మ్యాప్ లను కూడా పరిగణలోకి తీసుకుంటున్నామని రంగనాథ్ పేర్కొన్నారు. అమీన్ పూర్ చెరువు తూములు మూయడం వల్ల లేఔట్లు మునిగాయని, ఎఫ్ టీఎల్ లెవల్ పరిగణలోకి తీసుకొని చెరువుల సర్వే చేపట్టామని, తప్పుడు అనుమతులు ఇచ్చినవి, అనుమతులు రద్దు చేసిన ఇళ్లను మాత్రమే కూల్చివేశామని ఆయన అన్నారు. అనుమతులు లేకుండా ఉన్న పెద్దవాళ్లవైనా, పేదల వైనా కూల్చక తప్పదన్నారు.
Aadi Srinivas : హైకోర్టు తీర్పు బీఆర్ఎస్ నేతలకు చెంప చెళ్లుమనిపించేలా ఉంది
కొంతమందిపై చర్యలు తీసుకోవడం వల్లే హైడ్రా చేసే పని అందరికి తెలిసిందని, ప్రజల్లో ఎఫ్టీఎల్, బఫర్ జోన్లపై అవగాహన వచ్చి చర్చ జరిగిందన్నారు. మానవత్వం కోణంలో ఆలోచిస్తే సమాజమంతా బాధపడుతుందని, కొన్ని చోట్ల మనుసును చంపుకొని కూడా పని చేయాల్సి వస్తుందని ఆయన అన్నారు. అక్రమ నిర్మాణాల నియంత్రణకు అత్యాధునిక సాంకేతికతను ఉపయోగిస్తున్నామని, ఎఫ్ టీఎల్ నిర్ధారించాక.. చెరువుల్లో ఏదైన అక్రమ నిర్మాణం చేపడితే మాకు అలర్ట్ వస్తుందన్నారు. ఇప్పటి వరకు ఆక్రమణలు జరిగాయి, ఇకపై ఆక్రమణలు చేయకుండా అడ్డుకోవడమే ప్రభుత్వ ఉద్దేశమని, చెరువులు ఆక్రమణలకు గురికాకుండా స్థానికులు నిఘా పెడుతున్నారన్నారు ఏవీ రంగనాథ్.
Darshan Case: దర్శన్‌కి బిగుసుకుంటున్న ఉచ్చు.. రేణుకాస్వామి హత్యలో కొత్త సాక్ష్యాలు..
ఈ రోజు నిర్వహించిన బ్రెయిన్ స్టార్మింగ్ సమావేశంలో ఇరిగేషన్, వాటర్ రిలేటెడ్ డిపార్ట్ మెంట్ లో పని చేసిన రిటైర్ అయ్యిన అనుభవంతులైన అధికారులతో సూచనలు తీసుకున్నామన్నారు. చెరువుల పరిరక్షణ కోసం అవసరమైన చర్యలు చేపడతామని, ఎప్పటికప్పుడు అవసరమైనప్పుడు ఇలాంటి మేధావుల సలహాలను తీసుకుంటామన్నారు. బెంగుళూర్ లో ఎక్కడా కూడా చెరువుల్లో ప్రైవేట్ భూమి లేదని, కేవలం అక్కడ ప్రభుత్వ భూముల్లోనే చెరువులు ఉన్నాయన్నారు. ఇక్కడి చెరువులకు బెంగుళూరు చెరువులకు కొన్ని తేడాలు ఉన్నాయని, ఇక్కడికి వచ్చిన వారిలో కొందరు హైడ్రాతో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారన్నారు. ఖచ్చితంగా వారి అనుభవాన్ని వినియోగించుకుంటామని, ఇప్పటి వరకు ఎఫ్‌టీఎల్‌లో నిర్మించి ఉన్న గృహాలను ఎట్టి పరిస్థితుల్లో కూల్చివేయమని ఆయన పేర్కొన్నారు. ఇకపై ఏక్కడా కూడా ఎఫ్‌టీఎల్ పరిధిలో నిర్మాణాలు చేపట్టకుండా చర్యలు తీసుకుంటామన్నారు.