IND vs AUS: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా.. ఆసీస్ జట్టులో మార్పులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐదు టీ20 సిరీస్ లో భాగంగా కాసేపట్లో భారత్-ఆస్ట్రేలియా మధ్య 3 టీ20 మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ గౌహతిలోని బర్సపరా స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. కాగా.. ఇప్పటికే రెండు మ్యాచ్ ల్లో విజయం సాధించిన టీమిండియా.. ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ సొంతం చేసుకోవాలని చూస్తోంది. మరోవైపు వరుస ఓటమిపాలైన కంగారుల జట్టు.. ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ ఇండియా వశం కావొద్దని చూస్తోంది.
ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టు భారీ మార్పులు చేసింది. సీనియర్ బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్, లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా స్వదేశానికి వెళ్లారు. అంతేకాకుండా.. గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినీస్, సీన్ అబాట్ నాలుగో టీ20కి అందుబాటులో ఉండరు. వారు కూడా ఆస్ట్రేలియాకు వెళ్లనున్నారు. అయితే వారి స్థానంలో వేరే ఆస్ట్రేలియా ఆటగాళ్లను భర్తీ చేసింది. మరోవైపు ఈ మ్యాచ్ లో.. ఆస్ట్రేలియా ఏకంగా నాలుగు మార్పులతో బరిలోకి దిగింది. జట్టులోకి ట్రావిస్ హెడ్, ఆరోన్ హార్డీ, కేన్ రిచర్డ్‌సన్, బెహ్రెన్‌డార్ఫ్ వచ్చారు. టీమిండియా కూడా.. ఒక్క మార్పుతో బరిలోకి దిగుతుంది. ముఖేష్ కుమార్ స్థానంలో అవేశ్ ఖాన్ అతని స్థానంలోకి వచ్చాడు.
Also Read
- Rahul Gandhi: ఇండీ కూటమి నేతలకు రాహుల్ గాంధీ ‘‘టీ’’ పార్టీ..
- Muhammad Yunus: ‘నువ్వు టెర్రరిస్టువి’.. న్యూయార్క్ ఎయిర్‌పోర్టులో మహమ్మద్ యూనస్‌కు నిరసన సెగ!
- Himanta Biswa Sarma: డీకే శివకుమార్ కాలర్ పట్టిన రాహుల్ గాంధీ.. ‘‘అహంకారం’’ అంటూ హిమంత విమర్శలు..
- CJP Protest: సీజేపీ నిరసనలకు పాక్ నుంచి ఫేక్ కంటెంట్.. ఎఫ్ఐఆర్ నమోదు..
World Cup: ఫైనల్‌లో భారత్ ఓటమిపై సంబరాలు.. కాశ్మీరీ స్టూడెంట్స్‌పై “ఉపా” కేసు..
టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్
రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్ (W), సూర్యకుమార్ యాదవ్ (C), తిలక్ వర్మ, రింకూ సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, అవేశ్ ఖాన్, ప్రసిధ్ కృష్ణ.
ఆస్ట్రేలియా ప్లేయింగ్ ఎలెవన్
ట్రావిస్ హెడ్, ఆరోన్ హార్డీ, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్, మాథ్యూ వేడ్ (కెప్టెన్), నాథన్ ఎల్లిస్, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, తన్వీర్ సంఘా, కేన్ రిచర్డ్‌సన్
తాజావార్తలు
-
Maruthi: మళ్ళీ హోం గ్రౌండ్‌కి డైరెక్టర్ మారుతి?
-
Rahul Gandhi: ఇండీ కూటమి నేతలకు రాహుల్ గాంధీ ‘‘టీ’’ పార్టీ..
-
Muhammad Yunus: ‘నువ్వు టెర్రరిస్టువి’.. న్యూయార్క్ ఎయిర్‌పోర్టులో మహమ్మద్ యూనస్‌కు నిరసన సెగ!
-
Himanta Biswa Sarma: డీకే శివకుమార్ కాలర్ పట్టిన రాహుల్ గాంధీ.. ‘‘అహంకారం’’ అంటూ హిమంత విమర్శలు..
-
Telangana: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో తెలంగాణ వాసి మృతి.. ప్రభుత్వం కీలక నిర్ణయం
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!