ఐపీఎల్ తర్వాత ఆ స్థాయిలో సక్సెస్ అయిన లీగ్ ఆస్ట్రేలియన్ బిగ్ బాష్ లీగ్. 14 సీజన్లు కంప్లీట్ చేసుకున్న ఈ లీగ్ 15వ సీజన్ కోసం సిద్దమవుతుంది. ఈ లీగ్ లో పాల్గొనే ఫ్రాంచైజీలు ఇప్పటి నుంచే ఆటగాళ్లతో ఒప్పందం చేసుకుంటున్నాయి. అందులో భాగంగా పాకిస్థాన్ స్టార్ క్రికెటర్ బాబర్ అజామ్ తో ఆస్ట్రేలియా ఒప్పందం కుదుర్చుకుంది. సిడ్నీ సిక్సర్స్ బాబర్ తో డీల్ సెట్ చేసింది. ఆస్ట్రేలియన్ స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ ఈ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
Also Read:11A Mystery: రెండు భారీ విమాన ప్రమాదాలు.. ఆ సీటులో కూర్చున్న ఈ ఇద్దరు మాత్రం ఎలా బతికారు..?
బాబర్ జట్టులో చేరడంతో వచ్చే సీజన్లో ఈ ఇద్దరు ఇన్నింగ్స్ ను ప్రారంభించే అవకాశముంది. టి20 ఇంటర్నేషనల్, పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో బాబర్ అజామ్ అద్భుత ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుని బిగ్ బాష్ లీగ్ కోసం బాబర్ తో ఒప్పదం చేసుకున్నట్లు సిడ్నీ జనరల్ మేనేజర్ తెలిపాడు. కాగా పాకిస్థాన్ టి20 క్రికెట్ నుంచి బాబర్ అజాంను తొలగించిన సంగతి తెలిసిందే. బాబర్ తో పాటు మహ్మద్ రిజ్వాన్, షాహీన్ అఫ్రిదిలను కూడా టీ20 జట్టు నుంచి తొలగించారు.
Also Read:WTC Final 2025: ఫైనల్‌లో టెంబా బవుమా చిరస్మరణీయ ఇన్నింగ్స్..
ఈ నేపథ్యంలో బాబర్ అజమ్ ఆస్ట్రేలియా లీగ్ లో ఆడేందుకు సిద్దమైనట్లు తెలుస్తుంది. కాగా తనను జట్టులోకి చేర్చుకున్నందుకు బాబర్ అజమ్ సిడ్నీ సిక్సర్స్ కు ధన్యవాదాలు తెలిపాడు. ప్రపంచంలోని అత్యుత్తమ టి20 లీగ్ లలో ఒకటైన బిగ్ బాష్ లీగ్ లో ఆడటం సంతోషంగా ఉందన్నాడు.