Muttiah Muralitharan Says he Likes Natural Star nani: ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ గా 800 సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. తాజాగా తెలుగు మీడియాతో ఆయన ముచ్చటించిన క్రమంలో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు. మీరు తెలుగు సినిమాలు చూస్తారా? అని అడిగితే శ్రీలంకలో తెలుగు సినిమాలు విడుదల కావు కానీ తమిళ, హిందీ సినిమాలు విడుదల అవుతాయని అన్నారు. తమిళ, హిందీ భాషల్లో డబ్బింగ్ చేసిన తెలుగు సినిమాలు చూస్తామని పేర్కొన్న ఆయన ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’, ‘పుష్ప’ సినిమాలను కూడా పాన్ ఇండియా రిలీజ్ చేశారు. హిందీ, తమిళ భాషల్లో కూడా ఆ సినిమాలు విడుదల చేశారని, అవి చూశామని అన్నారు. ఇప్పుడు తెలుగు సినిమాలకు ఆదరణ పెరుగుతోందని పేర్కొన్న ఆయన ముఖ్యంగా శ్రీలంకలో బాలీవుడ్ మూవీస్ ఫేమస్ అని అన్నారు.
Sankranthi releases: దుమ్ము దులిపి మళ్ళీ కర్చీఫులు వేస్తున్న నిర్మాతలు
శ్రీలంక వాళ్ళకు హిందీ తెలుసని పేర్కొన్న ఆయన ఇప్పుడు పరిస్థితి మారిందని అందుకే తెలుగు సినిమా టాప్ పొజిషన్‌కు చేరుకుందనిం అన్నారు. ఇక మీకు ఇష్టమైన తెలుగు నటుడు ఎవరు ? అని అడిగితే ఇతర భాషలతో పోలిస్తే తెలుగులో సూపర్ హీరోస్, స్టార్ హీరోస్ ఎక్కువ మంది ఉన్నారని పేర్కొన్నారు ముత్తయ్య. అయితే తాను నాని సినిమాలు ఎక్కువ చూశానని ‘శ్యామ్ సింగ రాయ్’ చూశా, ‘ఈగ’, ‘జెర్సీ’తో పాటు నానివి చాలా సినిమాలు చూశానని అన్నారు. డబ్బింగ్ సినిమాలు కనుక తెలుగు టైటిల్స్ ఎక్కువ గుర్తు లేవని పేర్కొన్న ఆయన నటన అంటే ఇష్టం అని, యాక్షన్ హీరో కాదు… డ్రామా, ఎమోషన్స్ ఉంటాయి అందుకే అవి నేచురల్ స్టార్ అని అన్నారు.