WTC Final: ఐపీఎల్ 2025 పొడిగింపుపై కొనసాగుతున్న సందిగ్ధత మధ్య క్రికెట్ ఆస్ట్రేలియా (CA) తాజాగా తమ డబ్ల్యూటీసీ (వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్) ఫైనల్, ఆ తర్వాత జరిగే వెస్టిండీస్ టూర్ కోసం జట్టును మంగళవారం అధికారికంగా ప్రకటించింది. జూన్ 11 నుంచి లార్డ్స్‌లో జరగనున్న ఫైనల్‌లో దక్షిణాఫ్రికాతో తలపడేందుకు 15 మందితో కూడిన జట్టును ఎంపిక చేసింది.
Read Also: Tiranga Yatra: భారత సైనికుల త్యాగాలకు గౌరవంగా దేశవ్యాప్తంగా ‘తిరంగా యాత్ర’ చేపట్టనున్న బీజేపీ.!
ఇక ఈ జట్టులో శస్త్రచికిత్స చేపించుకున్న అనంతరం కామెరాన్ గ్రీన్ తిరిగి జట్టులోకి వచ్చాడు. స్పిన్నర్ మాట్ కుహ్నేమన్న్‌కు కూడా చోటు లభించింది. షెఫీల్డ్ షీల్డ్ ఫైనల్‌లో అద్భుతంగా రాణించిన బ్రెండన్ డాగెట్‌ను ట్రావెలింగ్ రిజర్వ్‌గా ఎంపిక చేశారు. ఇటీవల శ్రీలంకపై 2-0, భారత్‌పై 3-1 సిరీస్‌లను గెలిచిన అదే బలమైన స్క్వాడ్‌ను కొనసాగించారు. ఫైనల్ కు ఎటువంటి పెద్ద మార్పులు లేకుండా ఈ జట్టు ప్రకటించడం విశేషం. పాట్ కమ్మిన్స్ నేతృత్వంలోని జట్టు రెండోసారి డబ్ల్యూటీసీ టైటిల్ పై కన్నేసింది.
గాయాల కారణంగా శ్రీలంక టూర్, ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమైన పాట్ కమ్మిన్స్, జోష్ హేజిల్ వుడ్ లు ఐపీఎల్ ద్వారా తిరిగి ఫిట్‌నెస్ సాధించి జట్టులోకి వచ్చారు. ఇక గత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ లో భాగంగా ఆసీస్ 19 టెస్టుల్లో 13 విజయాలతో 67.54 పాయింట్ల శాతంతో ఫైనల్‌కు అర్హత సాధించింది. మరోవైపు దక్షిణాఫ్రికా 12 టెస్టుల్లో 8 విజయాలతో 69.44 పాయింట్ల శాతంతో టేబుల్ టాపర్‌గా నిలిచింది. ఇక ఈ ఫైనల్ మ్యాచ్ ముగిసాక ఆస్ట్రేలియా కరేబియన్ టూర్‌లో ఆస్ట్రేలియా మూడు టెస్టులు ఆడనుండగా ఇదే జట్టును కొనసాగించనున్నారు. బియూ వెబ్‌స్టర్‌ను ప్రధాన ఆల్‌రౌండర్‌గా కొనసాగించగా, సమ్ కాన్స్టాస్ తిరిగి ఎంపికయ్యాడు.
Read Also: Hair Fall Remedies: వెంట్రుకలు పొడిబారకుండా, ఊడిపోకుండా ఉండాలంటే ఇలా చేస్తే సరి.!
ఆస్ట్రేలియా డబ్ల్యూటీసీ ఫైనల్ జట్టు:
పాట్ కమ్మిన్స్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ కేరీ, కామెరాన్ గ్రీన్, జోష్ హేజిల్వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, సామ్ కాన్స్టాస్, మాట్ కుహ్నెమ్మాన్, మార్నస్ లబుషేన్, నేథన్ లయన్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, బియూ వెబ్‌స్టర్.
ట్రావెలింగ్ రిజర్వ్: బ్రెండన్ డాగెట్.
The Australian squads are in for the World Test Championship Final and the West Indies Test tour: https://t.co/WH8D86EqRi pic.twitter.com/MikVgS6YC2
— cricket.com.au (@cricketcomau) May 13, 2025