Shamar 7-68 scripts West Indies historic win vs Australia: వెస్టిండీస్ క్రికెట్ జట్టు అద్భుత టెస్ట్ విజయం సాధించింది. బ్రిస్బేన్‌లోని గబ్బా వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. 216 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ విండీస్ పేసర్ షమర్ జోసెఫ్ దెబ్బకు 207 పరుగులకు ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ (91) విజయం కోసం చివరకు పోరాడినా.. ఫలితం లేకుండా పోయింది. షమర్ 7 వికెట్లు పడగొట్టాడు. ఈ విజయంతో వెస్టిండీస్ 2 టెస్టుల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. తొలి టెస్టులో ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వెస్టిండీస్ 27 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాను స్వదేశంలో ఓడించింది.
4వ రోజైన ఆదివారం 156 పరుగుల ఛేదనకు దిగింది. స్టీవ్ స్మిత్, కామెరాన్ గ్రీన్ క్రీజులో ఉండడంతో ఆస్ట్రేలియా మంచి స్థితిలో నిలిచింది. అయితే విండీస్ ఫాస్ట్ బౌలర్ షమర్ జోసెఫ్ నిప్పులు చేరగడంతో ఆస్ట్రేలియాకు ఓటమి తప్పలేదు. గ్రీన్ అనంతరం వికెట్ల పతనం కొనసాగింది. మిచెల్ స్టార్క్ (21; 13 బంతుల్లో) ధాటిగా ఆడే ప్రయత్నం చేసినా.. అతడిని షమర్ వెనక్కి పంపాడు. 9 పరుగులు అవసరం అయిన సమయంలో జోష్ హేజిల్‌వుడ్ క్లీన్ బౌల్డ్ అవ్వడంతో ఆసీస్ కథ ముగిసింది. షమర్ బొటనవేలు గాయంతో బాధపడుతున్నప్పటికీ.. 11.5 ఓవర్లు నిరంతరాయంగా బౌలింగ్ చేసి 68 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టాడు. ఇందులో నలుగురు బ్యాట్స్‌మెన్ క్లీన్ బౌల్డ్ అవ్వడం విశేషం.
వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 311 పరుగులు చేసింది. కావెం హాడ్జ్ (79), కెవిన్ సింక్లైర్ (50)లు హాఫ్ సెంచరీలు చేశారు. మిచెల్ స్టార్క్ నాలుగు వికెట్స్ పడగొట్టాడు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌ను 9 వికెట్లకు 289 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఉస్మాన్ ఖవాజా (75), అలెక్స్ కారీ (65), ప్యాట్ కమిన్స్ (64) అర్ధ సెంచరీలు చేశారు. జోష్ హేజిల్‌వుడ్ బ్యాటింగ్ చేయలేదు. అల్జారీ జోసెఫ్ 4 వికెట్స్ తీశాడు. ఆపై రెండో ఇన్నింగ్స్‌లో విండీస్ 193 పరుగులకు ఆలౌట్ అయింది. కిర్క్ మెకెంజీ (41) టాప్ స్కోరర్. హేజిల్‌వుడ్, లయన్ చెరో మూడు వికెట్స్ తీశారు.
It’s all over!!!
Shamar Joseph takes SEVEN #AUSvWI pic.twitter.com/fsGR6cjvkj
— cricket.com.au (@cricketcomau) January 28, 2024