Aus vs Pak: పాకిస్థాన్ ముందు తోక ముడిచిన ఆస్ట్రేలియా
- అడిలైడ్ వన్డేలో పాక్ జట్టు ఆస్ట్రేలియాపై విజయం.
- సిరీస్ 1-1తో సమం
- చివరి వన్డే ఆదివారం పెర్త్‌లో.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Australia vs Pakistan: అడిలైడ్ వన్డేలో పాక్ జట్టు ఆస్ట్రేలియాను ఏకపక్షంగా ఓడించింది. మెల్‌బోర్న్‌లో ఓటమిపాలైన పాకిస్థాన్ జట్టు.. అడిలైడ్‌లో ఆస్ట్రేలియాకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా భారీ విజయం సాధించి సిరీస్‌ను 1-1తో సమం చేసింది. అడిలైడ్ వన్డేలో ఆస్ట్రేలియా జట్టు ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్స్, బౌలర్లు తమ సత్తాను ప్రదర్శించలేకపోయారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా కేవలం 35 ఓవర్లలో 163 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయ్యింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేపట్టిన పాకిస్థాన్ జట్టు 26.3 ఓవర్లలో ఈ లక్ష్యాన్ని సాధించింది. అడిలైడ్ మైదానంలో 28 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాను ఓడించిన పాకిస్థాన్‌కు ఈ విజయం చాలా ప్రత్యేకం. 1996లో అడిలైడ్‌లో జరిగిన వన్డేలో పాకిస్థాన్ చివరిసారిగా ఆస్ట్రేలియాను ఓడించింది.
Read Also: India–Russia Relations: భారత్‌పై మరోసారి ప్రశంసలు కురిపించిన రష్యా అధ్యక్షుడు
Also Read
సామ్ అయూబ్, హరీస్ రవూఫ్‌ల కారణంగా ఆస్ట్రేలియాకు ఎక్కువ నష్టం వాటిల్లింది. ముందుగా హారిస్ రవూఫ్ తన ఫాస్ట్ బంతులతో ఆస్ట్రేలియా మిడిల్ ఆర్డర్‌ను కూలగొట్టాడు. ఈ రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ జోష్ ఇంగ్లిస్, మార్నస్ లాబుస్‌చాగ్నే, ఆరోన్ హార్డీ, గ్లెన్ మాక్స్‌వెల్, పాట్ కమిన్స్‌లను పెవిలియన్ కు చేర్చాడు. హారిస్ రౌఫ్ ఆస్ట్రేలియాపై తన అత్యుత్తమ వన్డే ప్రదర్శనను అందించాడు. అతను కేవలం 8 ఓవర్లు వేసి 29 పరుగులిచ్చి 5 వికెట్లను నేలకూల్చాడు. అంతేకాదు అడిలైడ్ మైదానంలో ఏ పాకిస్తానీ ఫాస్ట్ బౌలర్‌కైనా ఇదే అత్యుత్తమ ప్రదర్శన. ఆ తర్వాత పాకిస్థాన్ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ సామ్ అయ్యూబ్ కేవలం 71 బంతుల్లో 82 పరుగులు చేశాడు. తన ఇన్నింగ్స్‌లో 6 సిక్సర్లు, 5 ఫోర్లు బాదాడు. స్టార్క్, హేజిల్‌వుడ్, పాట్ కమిన్స్, జంపా వంటి బౌలర్లను ఎవరిని విడిచిపెట్టలేదు. అయుబ్ అబ్దుల్లా షఫీక్‌తో కలిసి 122 బంతుల్లో 137 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడం ద్వారా ఆస్ట్రేలియాను మ్యాచ్ నుండి పాకిస్థాన్ ను విజయ తీరాలకు చేర్చాడు. సామ్ అయ్యూబ్ తర్వాత, అబ్దుల్లా షఫీక్ కూడా అద్భుత అర్ధ సెంచరీ ఇన్నింగ్స్ ఆడాడు. షఫీక్ 64 పరుగులతో నాటౌట్‌గా నిలవగా, బాబర్ ఆజం కూడా 15 పరుగులతో అజేయంగా నిలిచాడు. చివరి వన్డే ఆదివారం పెర్త్‌లో జరగనుంది. ఇది సిరీస్ డిసైడర్ గా మారింది.
Babar Azam hit a six to Zampa to finish in style 🔥🔥#BabarAzam𓃵 #PAKvAUS #PAKvsAUS #AUSvPAK #AUSvsPAK
— Babar Azam's World (@Babrazam358) November 8, 2024
తాజావార్తలు
-
Anil Ravipudi: సంక్రాంతి టార్గెట్‌గా అనిల్ రావిపూడి కొత్త సినిమా.. ముహూర్తం డేట్ అఫీషియల్‌గా ప్రకటించిన డైరెక్టర్!
-
India Job Crisis: ఇంజనీరింగ్ చేసి స్వీపర్ పోస్టులకు అప్లై చేస్తున్నారు.. ఇక డిగ్రీలు దండగేనా?
-
POK killings: పీఓకేలో పాక్ హత్యాకాండ.. 30 మంది బ్రిటిష్ ఎంపీల ఆందోళన..
-
Ponguleti Srinivas Reddy : గత ప్రభుత్వం పదేళ్ల పాలనలో చేసిందేమీ లేదు
-
Tech News: మనల్ని మింగేసే రాక్షసి..! బాంబు పేల్చిన ‘క్లాడ్’
ట్రెండింగ్
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!