AUS vs IND: కోహ్లీ, రోహిత్ భవితవ్యం మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది: గవాస్కర్
- మరికొన్ని రోజుల్లో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ
- భారత జట్టుకు ఎదురుకానున్న కఠిన సవాల్
- పేస్‌కు ఎదురొడ్డి నిలవాలంటే మాటలు కాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా సీనియర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల భవితవ్యం మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న ఆస్ట్రేలియా సిరీస్‌తో తేలిపోనుందని క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ చెప్పారు. ఈ ఇద్దరు బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో రాణిస్తే మరికొంతకాలం ఆడే అవకాశం ఉంటుందన్నారు. ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల సిరీస్‌ను గెలవడంపైనే దృష్టి సారించాలని, ఆ తర్వాతే ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ గురించి ఆలోచించాలని సన్నీ సూచించారు. మొన్నటివరకు అత్యంత బలంగా ఉందనిపించిన భారత జట్టుకు ఇప్పుడు కఠిన సవాల్ ఎదురుకానుందని గవాస్కర్ అన్నారు.
Also Read
- Parliament Monsoon Session: భయపడొద్దు, పారిపోవద్దు.. అమిత్ షా వస్తున్నాడు..
- Abhijeet Dipke: త్వరలో జంతర్‌మంతర్-2 ప్రారంభం.. అభిజీత్ దిప్కే ప్రకటన
- Police Lathi Testing: పోలీసుల "లాఠీ"లకు ఇన్ని పరీక్షలా.. మనుషుల్ని కొట్టి మరీ పరీక్షిస్తారా.?
- Yashwant Varma: జస్టిస్ యశ్వంత్ వర్మకు షాక్.. విచారణ కమిటీ సంచలన రిపోర్ట్
సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ… ‘ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల సిరీస్‌ను గెలవడంపైనే దృష్టి సారించాలని నేను ఇప్పటికే చెప్పా. ఎలా గెలవన్నది పక్కన పెడితే.. సిరీస్ మాత్రం కచ్చితంగా నెగ్గాలి. ఆ తర్వాతే ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ గురించి ఆలోచించాలి. మొన్నటివరకు బలంగా ఉందనిపించిన భారత జట్టుకు ఇప్పుడు బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో కఠిన సవాల్ ఎదురుకానుంది. గత కొన్నేళ్లుగా అద్భుతంగా ఆడిన సీనియర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇటీవల తమ స్థాయి తగ్గ ప్రదర్శన చేయలేదు. ఇంగ్లండ్, ఆస్ట్రేలియాను ఓడించిన టీమిండియా.. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో ఓడుతుందని ఎవరూ ఊహించలేదు. సీనియర్లు రోహిత్, కోహ్లీ కూడా భారీగా పరుగులు చేయలేదు. అందుకే ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ వీరి భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఆస్ట్రేలియాలో పేస్‌కు ఎదురొడ్డి నిలవాలంటే మాటలు కాదు. రోహిత్, కోహ్లీలు తమా సత్తాను నిరూపించుకొని కొనసాగుతారా? లేదా? చూడాలి’ అని అన్నాడు.
తాజావార్తలు
-
Parliament Monsoon Session: భయపడొద్దు, పారిపోవద్దు.. అమిత్ షా వస్తున్నాడు..
-
AP Investments : ఏపీకి భారీ పెట్టుబడుల జాతర.. రూ.2.08 లక్షల కోట్లకు SIPB గ్రీన్ సిగ్నల్.!
-
Abhijeet Dipke: త్వరలో జంతర్‌మంతర్-2 ప్రారంభం.. అభిజీత్ దిప్కే ప్రకటన
-
Police Lathi Testing: పోలీసుల “లాఠీ”లకు ఇన్ని పరీక్షలా.. మనుషుల్ని కొట్టి మరీ పరీక్షిస్తారా.?
-
Doctors Strike : జూనియర్ డాక్టర్ల సమ్మె.. ఏపీ సర్కార్‌కు వైద్యుల అల్టిమేటం.!
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..