NTV Telugu Site icon

Border Gavaskar Trophy: ఆమె కాళ్లు మొక్కి ఫ్లైట్ ఎక్కిన పంత్.. వీడియో వైరల్!

Rishabh Pant Mother

Rishabh Pant Mother

సొంతగడ్డపై న్యూజిలాండ్‌ చేతిలో ఘోర పరాభవం చవిచూసిన భారత్.. ఇప్పుడు కీలక సమరానికి సిద్ధమవుతోంది. నవంబర్ 22 నుంచి ప్రారంభం కానున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. గత రెండు సిరీస్‌లు గెలుచుకున్న టీమిండియా.. హ్యాట్రిక్‌పై కన్నేసింది. డబ్ల్యూటీసీ ఫైనల్‌ చేరాలంటే ఆస్ట్రేలియాపై భారత్ ఐదు మ్యాచ్‌ల్లో కనీసం నాలుగింటిలోనైనా గెలవాలి. కీలక సిరీస్ కాబట్టి భారత ఆటగాళ్లు ముందుగానే కంగారో గడ్డపై అడుగుపెడుతున్నారు.

ఇప్పటికే బ్యాటర్లు కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్‌లు ఆస్ట్రేలియా చేరుకున్నారు. ప్రాక్టీస్, అక్క‌డి పరిస్థితులకు అలవాటు పడేందుకు ముందుగానే వెళ్లారు. ఈ ఇద్దరు ఆస్ట్రేలియా-ఎతో జరిగే రెండో అనధికార టెస్టులో ఆడనున్నారు. ఇక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి కేవలం రెండు వారాల సమయం మాత్రమే ఉండడంతో యువ వికెట్‌ కీపర్‌ రిషబ్ పంత్‌ కూడా ఫ్లైట్ ఎక్కేశాడు. బుధవారం ఢిల్లీ విమానాశ్రయంలో తల్లి సరోజ్ పంత్ కాళ్లు మెక్కి విమానాశ్రయం లోపలికి వెళ్ళాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Also Read: IPL Auction 2025: ఆర్‌సీబీ నిర్ణయంతో సంతోషంగా ఉన్నా.. మ్యాక్స్‌వెల్ ఆసక్తికర వ్యాఖ్యలు!

రిషబ్ పంత్‌ ఢిల్లీ నుంచి ముంబై చేరుకొని.. ఇండియా క్యాంప్‌లోని ఆటగాళ్లతో చేరాడు. ముంబైలోని మిగిలిన భారత ఆటగాళ్లతో కలిసి ఆస్ట్రేలియాకు పయనం అవనున్నాడు. పంత్ న్యూజిలాండ్‌ సిరీస్‌లోని ఆరు ఇన్నింగ్స్‌ల్లో 43.50 సగటుతో 261 పరుగులు చేశాడు. న్యూజిలాండ్‌పై మూడు అర్ధ సెంచరీలు చేయగా.. అత్యధిక స్కోరు 99. అంతకుముందు బంగ్లాదేశ్‌పై సెంచరీతో పంత్ టెస్టు క్రికెట్‌లోకి రే ఎంట్రీ ఇచ్చాడు. బంగ్లాపై రెండు టెస్టుల్లో 161 పరుగులు చేశాడు. దాంతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి పంత్ కీలక పాత్ర పోషించనున్నాడు.

Show comments