Border Gavaskar Trophy: ఆమె కాళ్లు మొక్కి ఫ్లైట్ ఎక్కిన పంత్.. వీడియో వైరల్!
- నవంబర్ 22 నుంచి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ
- ఐదు మ్యాచ్‌ల్లో కనీసం నాలుగింటిలోనైనా గెలవాలి
- ఫ్లైట్ ఎక్కిన రిషబ్ పంత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో ఘోర పరాభవం చవిచూసిన భారత్.. ఇప్పుడు కీలక సమరానికి సిద్ధమవుతోంది. నవంబర్ 22 నుంచి ప్రారంభం కానున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. గత రెండు సిరీస్‌లు గెలుచుకున్న టీమిండియా.. హ్యాట్రిక్‌పై కన్నేసింది. డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే ఆస్ట్రేలియాపై భారత్ ఐదు మ్యాచ్‌ల్లో కనీసం నాలుగింటిలోనైనా గెలవాలి. కీలక సిరీస్ కాబట్టి భారత ఆటగాళ్లు ముందుగానే కంగారో గడ్డపై అడుగుపెడుతున్నారు.
ఇప్పటికే బ్యాటర్లు కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్‌లు ఆస్ట్రేలియా చేరుకున్నారు. ప్రాక్టీస్, అక్కడి పరిస్థితులకు అలవాటు పడేందుకు ముందుగానే వెళ్లారు. ఈ ఇద్దరు ఆస్ట్రేలియా-ఎతో జరిగే రెండో అనధికార టెస్టులో ఆడనున్నారు. ఇక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి కేవలం రెండు వారాల సమయం మాత్రమే ఉండడంతో యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ కూడా ఫ్లైట్ ఎక్కేశాడు. బుధవారం ఢిల్లీ విమానాశ్రయంలో తల్లి సరోజ్ పంత్ కాళ్లు మెక్కి విమానాశ్రయం లోపలికి వెళ్ళాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Also Read
Also Read: IPL Auction 2025: ఆర్సీబీ నిర్ణయంతో సంతోషంగా ఉన్నా.. మ్యాక్స్‌వెల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
రిషబ్ పంత్ ఢిల్లీ నుంచి ముంబై చేరుకొని.. ఇండియా క్యాంప్‌లోని ఆటగాళ్లతో చేరాడు. ముంబైలోని మిగిలిన భారత ఆటగాళ్లతో కలిసి ఆస్ట్రేలియాకు పయనం అవనున్నాడు. పంత్ న్యూజిలాండ్ సిరీస్‌లోని ఆరు ఇన్నింగ్స్‌ల్లో 43.50 సగటుతో 261 పరుగులు చేశాడు. న్యూజిలాండ్‌పై మూడు అర్ధ సెంచరీలు చేయగా.. అత్యధిక స్కోరు 99. అంతకుముందు బంగ్లాదేశ్‌పై సెంచరీతో పంత్ టెస్టు క్రికెట్లోకి రే ఎంట్రీ ఇచ్చాడు. బంగ్లాపై రెండు టెస్టుల్లో 161 పరుగులు చేశాడు. దాంతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి పంత్ కీలక పాత్ర పోషించనున్నాడు.
Rishabh Pant is ready for BGT.
Blessings from mother & we are all set to go ✌️❤️#CricketTwitter #RishabhPant pic.twitter.com/pCxFXr70eY
— Riseup Pant (@riseup_pant17) November 6, 2024
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?