AUS vs IND: అయ్యో రాహులా.. మరీ 4 పరుగులేనా! ఇలా అయితే కష్టమే
- నవంబర్ 22 నుంచి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ
- మళ్లీ విఫలమైన రాహుల్
- ఆడేసుకుంటున్న నెటిజెన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ కోసం భారత బ్యాటర్లు కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్ అందరికంటే ముందుగానే కంగారో గడ్డపైకి అడుగుపెట్టారు. నేడు మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియా-ఏతో ఆరంభమైన అనధికారిక రెండో టెస్టులో బరిలోకి దిగారు. న్యూజిలాండ్ టెస్టు సిరీస్‌లో విఫలమైన రాహుల్ ఈ టెస్టులో అయినా రాణిస్తాడనుకుంటే.. మరలా నిరాశపరిచాడు. ఓపెనర్‌గా వచ్చి కేవలం 4 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. స్కాట్ బోలాండ్ బౌలింగ్‌లో క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
మరోవైపు యువ ఆటగాడు ధ్రువ్ జురెల్ మాత్రం సత్తాచాటాడు. టాప్‌ఆర్డర్ మొత్తం విఫలం అయినా ఒంటరి పోరాటం చేశాడు. 186 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సుల సాయంతో 80 పరుగులు చేసి భారత్‌ను ఆదుకున్నాడు. కంగారో గడ్డపై ఎలాంటి అనుభవం లేని జురెల్ హాఫ్ సెంచరీ చేయగా.. సీనియర్ అయిన కేఎల్ రాహుల్ మాత్రం తడబడ్డాడు. దాంతో సోషల్ మీడియాలో రాహుల్‌పై ట్రోల్స్ మొదలయ్యాయి. ‘ఇలా ఆడితే.. జట్టులో చోటు కష్టమే రాహుల్’, ‘అయ్యో రాహులా.. మరీ 4 పరుగులేనా’, ‘ఇక భారత జట్టు గురించి మర్చిపో’ అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read
- Green SM Limo: ఓలా-ఉబర్‌లకు పోటీగా కొత్త కంపెనీ.. బుకింగ్‌పై ఏకంగా 50% బంపర్ డిస్కౌంట్!!
- CM Chandrababu: ఏయూ వీసీ రాజశేఖర్‌పై సీఎం చంద్రబాబు ఫైర్!
- Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వండర్ కిడ్‌కు టాటా భారీ రివార్డ్.. నాడు ‘టాటా కర్వ్’.. నేడు ‘టాటా సియెర్రా’.. ఫీచర్స్ అదుర్స్!
- AB de Villiers: ముంబై లోకల్ గ్రౌండ్లో అభిమానులతో కలిసి క్రికెట్ ఆడి సందడి చేసిన ‘మిస్టర్ 360’.!
ఈ టెస్టులో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్-ఏ 161 పరుగులకే ఆలౌటైంది. ధ్రువ్ జురెల్ (80) హాఫ్ సెంచరీ చేయగా.. దేవదత్ పడిక్కల్ (26), నితీశ్ రెడ్డి (16), ప్రసిధ్ కృష్ణ (14) మాత్రమే రెండంకెల స్కోరు అందుకున్నారు. అభిమన్యు ఈశ్వరన్ (0), సాయి సుదర్శన్, తనుష్ కొటియన్ (0) డకౌట్ కాగా.. రుతురాజ్ గైక్వాడ్ (4), ఖలీల్ అహ్మద్ (1), ముకేశ్ కుమార్ (5) పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లు నెసెర్ 4, వెబ్‌స్టర్ 3 వికెట్స్ తీశారు.
తాజావార్తలు
-
Mega Hero : 100 కథలు రిజెక్ట్ చేసి ఎట్టకేలకు కొత్త సినిమాను లైన్ లో పెట్టిన యంగ్ హీరో
-
EPFO: ఈపీఎఫ్ఓ కొత్త నిబంధనలు.. UAN యాక్టివేషన్ ప్రక్రియలో కీలక మార్పులు
-
Green SM Limo: ఓలా-ఉబర్‌లకు పోటీగా కొత్త కంపెనీ.. బుకింగ్‌పై ఏకంగా 50% బంపర్ డిస్కౌంట్!!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
CM Chandrababu: ఏయూ వీసీ రాజశేఖర్‌పై సీఎం చంద్రబాబు ఫైర్!
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..