Crime News: కడప జిల్లాలో కులహంకార దాడి.. కర్రతో కొట్టి మరిగే నూనె పోశారు..
- కడప జిల్లాలో పెన్న పేరూరులో కులహంకార దాడి ఘటన
- ఓ వ్యక్తిని కర్రతో కొట్టడంతో పాటు నూనె పోసిన సుబ్బారెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime News: కడప జిల్లాలో కులహంకార దాడి ఘటన చోటుచేసుకుంది. ఒంటిమిట్ట మండలం పెన్న పేరూరు గ్రామంలో కులహంకార దాడి ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. కదిరి ప్రభాకర్ అనే వ్యక్తిపై గజ్జల సుబ్బారెడ్డి అనే వ్యక్తి కర్రతో కొట్టడంతో పాటు మరిగే నూనెను పోసినట్లు తెలిసింది. కదిరి ప్రభాకర్ పరిస్థితి విషమంగా ఉండడంతో రిమ్స్‌కు తరలించారు.
Read Also: Viral Video: ఎంత ట్యాలెంటెడ్ బ్రో నువ్వు.. కరిచిన పామును ఏకంగా ఆసుపత్రికి తీసుకెళ్లి..
Also Read
- Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
- CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
- Mumbai: ముంబైలో CJP నిరసనలు.. పోలీసుల అదుపులో అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్!
- Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్, ఈసీకి 124 మంది మాజీ-బ్యూరోక్రాట్ల మద్దతు.!
అసలేం జరిగిందంటే..
బాధితుడి కుటుంబ సభ్యుడు వెల్లడించిన వివరాల ప్రకారం.. కదిరి ప్రభాకర్ పొరుగు గ్రామమైన గంగపేరూరులో సమీప బంధువు మృతి చెందడంతో అంత్యక్రియలకు వెళ్లి వస్తూ గజ్జల సుబ్బారెడ్డి ఇంటికి సమీపంలోని అరుగుపై సొమ్మసిల్లి పడిపోయాడు. ఉదయం నుంచి అన్నం తినక పోవడంతో కళ్లు తిరిగి పడిపోయాడు. అగ్రకులస్థుల ఇళ్లు ఉన్న అరుగుపై దళితుడైన ప్రభాకర్ నిద్రించడంతో కులం పేరుతో దూషిస్తూ కర్రతో దాడి చేయడంతో పాటు మరిగే నూనె పోశాడు షాప్ యజమాని సుబ్బారెడ్డి. భర్త సొమ్మసిల్లి పడిపోవడంతో భార్య సుబ్బమ్మ ప్రభాకర్‌ను ఆటోలో ఇంటికి తీసుకెళ్లింది. రాత్రంతా నిద్రపోకుండా ఒళ్లంతా మంటగా ఉందటూ ప్రభాకర్ ఆహాకారాలు చేయడంతో అతని భార్య మజ్జిగ తాపించింది. మరోమారు మంటగా ఉందని చెప్పడంతో ప్రభాకర్ చొక్కా విప్పి చూడగా ఒంటిపై బొబ్బలు కనిపించాయి. బొబ్బలు చూసి ఏమి జరిగిందని భార్య ఆరా తీయగా.. జరిగిన విషయాన్ని ప్రభాకర్ చెప్పాడు. గ్రామీణ ప్రాంతం కావడంతో ఆ సమయంలో ఆటో దొరకక ఉదయాన్నే రిమ్స్ కు తరలించారు. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రభాకర్ పరిస్థితిపై 24 గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేమని వైద్యులు అంటున్నారు. దళితులపై తరచుగా దాడులు జరగడంపై కుల, మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గాయపరిచిన వారిని వెంటనే అరెస్ట్ చేసి శిక్ష పడేలాగా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.
తాజావార్తలు
-
Vijay Deverakonda : ఏడేళ్ళ ఎక్స్పీరియన్స్ రౌడీ హీరోని మార్చలేదా?
-
Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
-
CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
-
Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
-
Mumbai: ముంబైలో CJP నిరసనలు.. పోలీసుల అదుపులో అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!