Site icon NTV Telugu

Atishi: ఢిల్లీ సీఎం రేఖాగుప్తా భర్త ప్రభుత్వాన్ని నడుపుతున్నారు!

Delhi

Delhi

ఢిల్లీ సీఎం రేఖాగుప్తా భర్తపై మాజీ ముఖ్యమంత్రి అతిశీ సంచలన ఆరోపణలు చేశారు. రేఖాగుప్తా భర్త మనీష్ గుప్తా అనధికారంగా ప్రభుత్వాన్ని నడుపుతున్నారని ఆరోపించారు. పలువురు అధికారులతో మనీష్ గుప్తా సమావేశమైన ఫొటోను సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్ లో పోస్ట్ చేశారు.

READ MORE: Viral : అమ్మకు నానమ్మ, తాతయ్య నచ్చరంట.. క్శశ్చన్‌ పేపర్‌లో విద్యార్థినీ సమాధానం వైరల్

“ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్త భర్త మనీష్‌ గుప్తా పలువురు అధికారులతో సమావేశమయ్యారు. గ్రామాల్లో సర్పంచ్‌గా మహిళ ఎన్నికైతే ప్రభుత్వ విధులు ఆమె భర్త నిర్వర్తిస్తారని గతంలో మనం వినేవాళ్లం. కానీ, ఒక మహిళా సీఎం చేయాల్సిన పనులను ఆమె భర్త చేయడం ఎప్పుడూ చూడలేదు. ఇది దేశ చరిత్రలో ఇదే తొలిసారి. రేఖాగుప్తాకు ప్రభుత్వ విధులు ఎలా నిర్వర్తించాలో తెలియదా?’ అని అతిశీ పోస్టులో పేర్కొన్నారు.

READ MORE: WamiqaGabbi : వావ్ అనిపిస్తున్న వామిక గబ్బి లేటెస్ట్ ఫొటోస్

ఢిల్లీలో విద్యుత్‌ కోతలు, ప్రైవేటు పాఠశాలల ఫీజులు పెరిగడానికి కారణం ఆయా శాఖల్లో సీఎం ప్రమేయం లేకపోవడమేనా? అని ప్రశ్నించారు. అతీశీ ఆరోపణలపై ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు విరేంద్ర సచ్‌దేవా స్పందించారు. ఈ వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఒక మహిళ మరొక మహిళా సీఎంపై ఇలాంటి అవమానకర వ్యాఖ్యలు చేయడం సరికాదని స్పష్టం చేశారు.

READ MORE: WamiqaGabbi : వావ్ అనిపిస్తున్న వామిక గబ్బి లేటెస్ట్ ఫొటోస్

Exit mobile version