ముంబైలోని వెర్సోవా నుంచి ఓ వార్త వెలువడింది. సినీ నిర్మాత తన డ్రైవర్ పై కత్తితో దాడి చేశాడు. దీంతో నిర్మాతపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సమాచారాన్ని ముంబై పోలీసు అధికారి వెల్లడించారు. జీతం విషయంలో ఇద్దరి మధ్య వివాదం జరిగిందని.. అనంతరం నిర్మాత కత్తితో దాడి చేశాడని డ్రైవర్ ఫిర్యాదులో పేర్కొన్నాడు.
ఢిల్లీ సీఎం రేఖాగుప్తా భర్తపై మాజీ ముఖ్యమంత్రి అతిశీ సంచలన ఆరోపణలు చేశారు. రేఖాగుప్తా భర్త మనీష్ గుప్తా అనధికారంగా ప్రభుత్వాన్ని నడుపుతున్నారని ఆరోపించారు. పలువురు అధికారులతో మనీష్ గుప్తా సమావేశమైన ఫొటోను సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్ లో పోస్ట్ చేశారు.