TDP: మంత్రి ధర్మాన ప్రసాదరావుపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది తెలుగుదేశం పార్టీ.. వాలంటీర్లు ఎన్నికల విధుల్లో పాల్గొనవచ్చు అంటూ మంత్రి ధర్మాన చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న టీడీపీ.. ఎన్నికల సంఘానికి లేఖ ద్వారా ఫిర్యాదు చేసింది.. వాలంటీర్లు ఎన్నికల విధుల్లో ఉండరాదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని.. ఎన్నికల సంఘం ఆదేశాలను అధికార పార్టీకి చెందిన నాయకులు యధేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారంటూ ఎన్నికల సంఘానికి రాసిన లేఖలో పేర్కొన్నారు టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.. ప్రభుత్వానికి అనుకూలంగా వాలంటీర్లు ప్రచారం చేయాలని మంత్రులే బహిరంగంగా చెబుతున్నారని.. వృద్ధులు, వికలాంగుల పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తుల్లో వాలంటీర్ల ప్రమేయం లేకుండా ఎన్నికల సిబ్బందికి ఆదేశాలివ్వాలని ఈసీకి లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు.. వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని సీఈవో, డీఈవో, ఆర్వోలకు ఈసీ స్పష్టం చేయాలి.. మంత్రి ధర్మాన ప్రసాదరావుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని లేఖలో ఎన్నికల సంఘాన్ని కోరారు అచ్చెన్నాయుడు.
Read Also: Sreeshanth : ఎన్టీఆర్ తో నటించాలని వుంది..ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన టీం ఇండియా మాజీ క్రికెటర్..
కాగా, శ్రీకాకుళం జిల్లాలో వాలంటీర్ సేవలకు పురస్కారాల ప్రదానోత్సవంలో కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ధర్మాన ప్రసాదరావు.. వాలంటీర్ కూడా మీకు ఇష్టమైన వారికి ఓటు వేయాలని చెప్పే హక్కు ఉంది. ఏ ప్రభుత్వం కన్నీరు తుడిసిందో , ఏ ప్రభుత్వం ఆకలి తీర్చిందో చెప్పాలి అని పిలుపునిచ్చారు. ఇక, ఏ వృద్దుడు ఇతర పార్టీలకు ఓటు వేయరన్న ఆయన.. వృద్ధులకు పోస్టల్ బ్యాలెట్ ఉంది, దానిని వినియోగించమని చెప్పండి. మీరే దగ్గరుండి పోస్టల్ బ్యాలెట్ అప్లై చేయండి అని సూచించారు. వాలంటీర్ కి సర్వీస్ రూల్స్ ఏం లేవని వ్యాఖ్యానించారు. అవసరం అయితే వాలంటీర్ ఏజెంట్ గా కూర్చోవలసి ఉంటుందన్నారు ధర్మాన. ఏరకమైన ప్రతిఫలం ఆశించని వ్యక్తులు వాలంటీర్లు అని అభివర్ణించిన ఆయన.. ఏ వృత్తి అయినా పదిమంది గుర్తిస్తేనే సంతృప్తి లభిస్తుందన్నారు. అయితే, ధర్మాన కామెంట్లపై సీరియస్‌గా రియాక్ట్ అయిన టీడీపీ.. ఆ వ్యవహారాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్లింది.