Sreeshanth : ఎన్టీఆర్ తో నటించాలని వుంది..ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన టీం ఇండియా మాజీ క్రికెటర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘ఆర్ఆర్ఆర్ ‘ మూవీతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గ్లోబల్ స్థాయిలో పాపులర్ అయ్యారు.రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కొమరం భీంగా ఎన్టీఆర్ అద్భుతంగా నటించి మెప్పించారు. గ్లోబల్ వైడ్ గా ఎన్టీఆర్ కి భారీ స్థాయిలో అభిమానులు ఉన్నారు. ఇక ఎన్టీఆర్ ఫ్యాన్స్ లిస్టులో క్రికెటర్స్ కూడా ఉన్నారు.హైదరాబాదులో మ్యాచ్ ఉందంటే చాలు మన టీమ్ ఇండియా క్రికెటర్స్ తమకి ఇష్టమైన హీరోలను కలుస్తుంటారు. సూర్య కుమార్ యాదవ్, శుబ్ మన్ గిల్, చాహల్ మరియు ఇషాన్ కిషన్ లాంటి స్టార్ క్రికెటర్స్ ఇప్పటికే ఎన్టీఆర్ ని కలిసిన విషయం తెలిసిందే. వాటికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. ఇక తాజాగా మరో క్రికెటర్ అయితే ఏకంగా ఎన్టీఆర్ తో నటించాలని ఉందంటూ తన మనసులో కోరికను బయటపెట్టాడు.టీమిండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్ తాజా ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎన్టీఆర్ పై తనకున్న అభిమానాన్ని చూపుతూ తాజా ఇంటర్వ్యూలో శ్రీశాంత్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.”ఎప్పటికైనా ఎన్టీఆర్ తో నటించాలని ఉంది. ఎన్టీఆర్ నటన అంటే నాకు చాలా ఇష్టం. ఆయన డాన్స్ కి నేను పెద్ద ఫ్యాన్ ని. గతంలో ఒకసారి నేను ఎన్టీఆర్ ని కలిసాను. ఆ సమయంలో ఆయనతో మాట్లాడాను. మీరు బాగా డాన్స్ చేస్తారు అని చెప్పాను. దానికి ఆయన థాంక్స్ చెప్పడంతో పాటు సరదాగా ఫ్లైయింగ్ కిస్ ను కూడా ఇచ్చారు. ఎన్టీఆర్ ని చూస్తే ఎంతో మోటివేట్ గా ఉంటుంది. నేను ఎన్టీఆర్ ని కలిసిన ఈవెంట్లో అల్లు అర్జున్ కూడా ఉన్నారు” అంటూ చెప్పుకొచ్చాడు.ఒకప్పుడు ఇండియన్ బెస్ట్ బౌలర్స్ లో ఒకరిగా పేరు తెచ్చుకున్న శ్రీశాంత్ క్రికెట్ నుంచి రిటైర్డ్ అయిన తర్వాత 2017లో సినీ ఆరంగేట్రం చేశాడు. ‘అక్సర్ 2’ సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే… ఆ తర్వాత కొన్ని సౌత్ సినిమాల్లో కూడా నటించాడు.ప్రస్తుతం బాలీవుడ్ తో పాటు కొన్ని సౌత్ సినిమాల్లో కూడా నటిస్తున్నాడు.
Also Read
తాజావార్తలు
-
Thackeray Brothers: CJP ఆందోళనకు ఉద్ధవ్, రాజ్ ఠాక్రేల మద్దతు.!
-
Balochistan: పాక్ సైనికులపై BLA మహిళా యూనిట్ దాడి.. 9 మంది హతం..
-
Virat Kohli Hundred Centuries: విరాట్ కోహ్లీ 100 శతకాలు సాధిస్తాడా.. ఇదిగో సాధ్యసాధ్యాలు..
-
TGSPDCL : విద్యుత్ డిమాండ్‌లో కొత్త రికార్డు.. 12,044 మెగావాట్లు.!
-
Dhanush: ‘‘ధనుష్ రాజకీయాల్లోకి వచ్చేశాడు’’.. విజయ్‌పై కనిమొళి సెటైర్లు.!
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!