AstraZeneca: ప్రపంచవ్యాప్తంగా కరోనా టీకాను ఉపసంహరించుకున్న ఆస్ట్రాజెనెకా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AstraZeneca: తాము తయారు చేసిన కరోనా టీకాను ప్రపంచవ్యాప్తంగా ఉపసంహరించుకుంటున్నట్టు బ్రిటన్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా తెలిపింది. వాణిజ్యపరమైన కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది. టీకాతో రక్తం గడ్డకడుతున్నట్టు వస్తున్న ఆరోపణలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ టీకా తయారీ, సరఫరా నిలిపివేశామని, మార్కెటింగ్ అనుమతులు కూడా వెనక్కు తీసుకుంటున్నట్టు ఆస్ట్రాజెనెకా కంపెనీ చెప్పిందని అంతర్జాతీయ మీడియా చెప్పుకొచ్చింది. ఆస్ట్రాజెనెకా రూపొందించిన కరోనా టీకా విదేశాల్లో వాక్స్‌జెర్వియా, భారత్‌లో కోవిషీల్డ్ పేరుతో విక్రయించారు.
Read Also: M. K. Stalin:తమిళనాడుపరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన ట్రాన్స్ జెండర్, దళిత విద్యార్థికి సీఎం సత్కారం
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
కాగా, వాక్స్‌జెర్వియాతో రక్తం గడ్డకట్టి బాధితులు మరణించిన ఘటనలు బ్రిటన్‌లో వెలుగులోకి వచ్చాయని బాధితులు న్యాయ పోరాటం చేశాయి. టీకా కారణంగా యూకేలో 81 మంది మరణించగా.. తీవ్ర ఆనారోగ్యాలు తలెత్తినట్టు పలు కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో తమ టీకాతో రక్తం గడ్డకట్టే సమస్య ఉన్నట్టు ఆస్ట్రాజెనెకా బ్రిటన్ కోర్టులో వెల్లడించింది. ఐరోపా దేశాల్లో టీకాను వెనక్కు తీసుకునేందుకు మార్చి 5వ తేదీన సంస్థ దరఖాస్తు చేసుకోగా.. మంగళవారం నాటి నుంచి ఈ ఉపసంహరణ అమల్లోకి వచ్చింది ఆస్ట్రాజెనెకా పేర్కొనింది. బ్రిటన్ సహా, ఇతర దేశాల్లోనూ త్వరలో టీకా ఉపసంహరణ దరఖాస్తులను కంపెనీ దాఖలు చేసుకుంది.
Read Also: Allu Arjun : ఇంజిన్ లేని బోగిలా వెళ్తున్న నన్ను ఆయన సరైన దారిలో పెట్టారు..
ఇక, కరోనాను తుదముట్టించడంలో మా టీకా పాత్రను చూసి గర్వపడుతున్నాం అని ఆస్ట్రోజెనెకా తెలిపింది. సంక్షోభం తొలి ఏడాదిలోనే టీకా వినియోగంతో ఏకంగా 65 లక్షల మంది ప్రాణాలు కాపాడినట్లు పేర్కొనింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకూ 100 కోట్ల టీకాలను సరఫరా చేసినట్లు చెప్పుకొచ్చింది. కరోనా సంక్షోభ నివారణలో మా శ్రమను ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు గుర్తించాయని ఆస్ట్రాజెనెకా మీడియాతో చెప్పుకొచ్చింది.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!