NTV Telugu Site icon

Tirupati: మాజీ ప్రియుడితో కలిసి ప్రియుడిపై థియేటర్‌లో హత్యాయత్నం.. నిందితులు అరెస్ట్

Tirupati

Tirupati

Tirupati Crime: తిరుపతిలో సినిమా థియేటర్‌లో జరిగిన హత్యాయత్నం కేసును పోలీసులు ఛేదించారు. నగరంలోని ఓ సినిమా థియేటర్‌లో యువకుడు కత్తిపోట్లకు గురైన ఘటన కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రేమ వ్యవహారంలో ఓ యువకుడిపై మరో యువకుడు కత్తితో దాడి చేశాడు. తిరుపతిలోని పీజీఆర్‌ సినిమా థియేటర్‌లో ఈ ఘటన జరిగింది. దాడి చేసిన యువకుడు కార్తిక్‌, యువతి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటన శనివారం జరిగింది. మూడు రోజుల తర్వాత తిరుపతి భారతీ బస్టాండ్‌లో ప్రియుడు కార్తీక్, ప్రియురాలు కావ్యను తిరుపతి ఈస్ట్ పోలీసులు అరెస్టు చేశారు. థియేటర్‌లో ప్రేమికుడి లోకేష్ హత్యకు మాజీ ప్రియుడు కార్తీక్‌తో కలిసి ప్రియురాలు కావ్య ప్లాన్ చేసినట్లు తెలిసింది. మూడు రోజుల క్రితం సినిమా చూస్తుండగా లోకేష్‌ను కత్తితో పొడవాలని కావ్య గట్టిగా అరిచింది. వెంటనే సినిమా చూస్తున్న లోకేష్‌ను కార్తీక్ కత్తితో పొడిచాడు. లోకేష్‌ను పొడిచి కావ్య, కార్తిక్‌లు పరారయ్యారు. పాత కక్షలు మనసులో పెట్టుకుని లోకేష్ హత్యకు ప్రియురాలు కావ్య ప్లాన్ చేసినట్లు తెలిసింది.

Read Also: AP New Excise Policy: అక్టోబర్‌ 1 నుంచి ఏపీలో కొత్త మద్యం విధానం

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మోహన్‌బాబు యూనివర్సిటీ విద్యార్థి లోకేశ్ ఓ యువతితో కలిసి స్థానిక పీజీఆర్‌ థియేటర్‌లో సినిమాకు వెళ్లాడు. కార్తిక్ అనే యువకుడు లోకేశ్‌పై కత్తితో దాడి చేసి గాయపర్చాడు. కత్తితో దాడి చేసిన తరువాత కార్తీక్‌తో కలిసి యువతి పరారైంది. ఇద్దరు యువకులతో యువతి ప్రేమాయణం నడిపింది. యువతి పక్కా ప్లాన్‌తో హత్యాయత్నం చేయించినట్లు తెలిసింది. ఈ ఘటనలో లోకేశ్‌కు యువతే సినిమా టికెట్లు బుక్‌ చేసింది. పథకం ప్రకారమే కార్తిక్‌తో యువతి దాడి చేయించిందని పోలీసులు వెల్లడించారు.

Show comments