Site icon NTV Telugu

Himanta Biswa Sarma: నేను బతికి ఉన్నంత వరకు బాల్య వివాహాలు జరగనివ్వను..

Assam Cm

Assam Cm

Assam Cm: ముస్లిం వివాహాలు, విడాకుల చట్టాన్ని రద్దు చేసేందుకు అస్సాం ప్రభుత్వం ఇటీవల ఆమోదం తెలిపింది. ఇక, అస్సాం ప్రభుత్వ నిర్ణయంపై రాష్ట్రంలో విమర్శలు ఎక్కువయ్యాయి. ఈ విషయంపై ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ మరోసారి కాంగ్రెస్‌ పార్టీపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ప్రజలు జీవించి ఉన్నంత వరకు చిన్న పిల్లల జీవితాలను నాశనం చేయనివ్వమని ప్రతిజ్ఞ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Read Also: Rythu Bandhu: రైతు బంధు, భీమా పక్కదారి నిజమేనా..! క్లారిటీ ఇచ్చిన సైబరాబాద్ సీపీ..

ఇక, రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలలో ముస్లిం సమాజపు ఆడపిల్లలను నాశనం చేయడానికి మీరు తెరిచిన దుకాణాన్ని పూర్తిగా మూసివేసే వరకు తాము శాంతించము అని సీఎం హిమంత బిస్వా శర్మ తెలిపారు. 2026 నాటికి రాష్ట్రంలో బాల్య వివాహాలను పూర్తిగా నిర్మూలిస్తామన్నారు. ఈ సందర్భంగా శాసన సభలో ప్రతిపక్ష నేతలను ఉద్దేశించి.. ‘నేను చెప్పేది జాగ్రత్తగా వినండి.. నేను బతికి ఉన్నంత వరకు అస్సాంలో చైల్డ్ మ్యారేజీలు జరగనివ్వను అని తెలిపారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా మిషన్‌ను ప్రారంభించనున్నారు. ఈ మిషన్ కోసం మొత్తం 200 కోట్ల రూపాయలు వెచ్చించనున్నారు అని చెప్పుకొచ్చారు. మేం ముస్లింలకు వ్యతిరేకం అని కొందరు అంటున్నారు.. అయితే, ట్రిపుల్ తలాక్, బహుభార్యత్వం, బాల్య వివాహాలకు స్వస్తి పలికి ముస్లిం సమాజానికి కాంగ్రెస్ ప్రభుత్వం చేయనంత మేలు చేశామని సీఎం హిమంత బిస్వా శర్మ అన్నారు.

Exit mobile version