Rythu Bandhu: రైతు బంధు, భీమా పక్కదారి నిజమేనా..! క్లారిటీ ఇచ్చిన సైబరాబాద్ సీపీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rythu Bandhu: రైతుబంధు, రైతు బీమా పథకం డబ్బులు పక్కదారి పడుతున్నట్లు వస్తున్న వార్తలు తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారింది. దీనిపై పోలీసులు నిఘా పెట్టారు. నకిలీ పత్రాలతో రైతుబంధు రైతుబంధు బీమా పథకాలను కాజేస్తున్నారనే రంగారెడ్డి జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ ఫిర్యాదుతో రంగంలోకి దిగారు పోలీసులు. రైతుబంధు, రైతు బీమా పథకం డబ్బులు కొట్టేస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు. గత కొన్ని ఏళ్ల నుంచి రైతుబంధు బీమా డబ్బులను డ్రా చేసిన తమ సొంతపనులకు వాడుకుంటున్నట్లు వెలుగులోకి రావడంతో అధికారులు షాక్ తిన్నారు. నకిలీ పత్రాలు సృష్టించి నకిలీ వ్యక్తుల పేర్లతో డబ్బులు తీసుకుంటున్నట్లు గుర్తించారు పోలీసులు. భూములు లేకపోయినా ఉన్నట్లుగా సృష్టించి రైతుబంధు బీమా పథకాలు డబ్బులను ముఠా తీసుకుంటున్నట్లు తెలిపారు. వీరిని చాక చక్యంగా పట్టుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అయితే దీనిపై సైబరాబాద్ సీపి అవినాష్ మహంతి మాట్లాడుతూ.. క్లారిటీ ఇచ్చారు.
రంగారెడ్డి జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ ఫిర్యాదుతో రైతుబంధు, రైతు బీమా పథకం డబ్బులు కొట్టేసినట్లు వెలుగులోకి వచ్చిందని అన్నారు. రంగారెడ్డి జిల్లా కుందుర్గ్ మండలంలో 20 రైతు భీమా క్లైయిమ్స్ జరిగాయని తెలిపారు. ఈ 20 క్లైయిమ్స్ అనుమామానాస్పదంగా ఉన్నట్లు ఏఓ గుర్తించడం జరిగిందని అన్నారు. ఈ 20 క్లైయిమ్స్ ద్వారా సుమారు కోటి రూపాయల ఎల్ఐసి అమౌంటు రైతు బీమా కింద డైవర్ట్ చేశారని తెలిపారు. సుమారు 130 నకిలీ పట్టేదారులను క్రియేట్ చేసి రైతు బందు స్కీంలో క్లెయిమ్ చేశారని అన్నారు. ఇందులో కొంత మంది అప్పటికే చనిపోయి ఉన్నారని సంచలన విషయాలు బయటపెట్టారు సీపీ. కొన్ని రోజుల తరువాత చనిపోయారని చెప్పి నగదు డైవర్ట్ చేశారని అన్నారు. కుందర్గ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారని అన్నారు. ఆ తరువాత సైబరాబాద్ ఎకానమిక్స్ వింగ్ దర్యాప్తు చేసిందన్నారు. ఏఈఓ గోరెటి శ్రీశైలంతో పాటు వీరస్వామి ఇద్దరిని అరెస్టు చేశామని అన్నారు.
Also Read
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
- Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
- Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
డెత్ సర్టిఫికెట్ లో పైనా కింద ఒరిజనల్ ఉంటుంది, కాని మధ్యలో ఉండే పేర్లు, ఇతర వివరాలను ఏఈఓ శ్రీశైలం మార్ఫింగ్ చేశాడని అన్నారు. ఈ డబ్బుతో వ్యవసాయ భూమిని కొనుగోలు చేశాడని అన్నారు. తన బంధువులు, ఇతర కుటుంబ సభ్యులకు భూములు ఉన్నాయని తనకు లేకపోవడంతో ఇలా చేశానని శ్రీశైలం చెబుతున్నారని సీపీ అన్నారు. 2000 మంది రైతులు.. రైతు బంధను ఇతనే తీసుకునేవాడని క్లారిటీ ఇచ్చారు. ఆ రైతులకు మాత్రం ఏదో ఒక సాకు చెప్పేవాడని తెలిపారు. ఫీల్డ్ వెరిఫికేషన్ ఎల్ఐసీ చేయలేదని, ప్రభుత్వ అధికారి కావడంతో వాళ్ళకి ఎలాంటి అనుమానం రాలేదని అన్నారు. వీరసామితో ఏడు అకౌంట్ లు జాతీయ బ్యాంకులలో అకౌంట్ లు క్రియేట్ చేశాడని, ఏటీఏం, బ్యాంకు పాస్ బుక్ లను తన దగ్గరే పెట్టుకున్నాడని అన్నారు. కొనుగోలు చేసిన భూములను ఏసీబీకి అప్పగిస్తామని సీపీ క్లారిటీ ఇచ్చారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!