ఢిల్లీ నుంచి షామ్లీ మీదుగా సహారన్‌పూర్ వెళ్తున్న రైలుకు పెను ప్రమాదం తప్పింది. బల్వా-షామ్లి రైల్వే మార్గంలో ట్రాక్‌పై సిమెంట్, ఇనుప పైపులను ఉంచి రైలు ప్రమాదానికి కుట్రపన్నారు దుండగులు. లోకో పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న ఆర్‌పిఎఫ్, జిఆర్‌పి సంఘటన స్థలానికి చేరుకుని స్థానిక పోలీసులకు కూడా సమాచారం అందించారు. గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైలు చాలా సేపు అడవిలో నిలిచి ఉండటంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
Also Read:Amritha Aiyer : స్టన్నింగ్ లుక్ లో దర్శనమిచ్చిన హనుమాన్ బ్యూటీ..
ఈ రైలు శనివారం రాత్రి 7 గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరి షామ్లీ మీదుగా సహారన్‌పూర్‌కు వెళుతుంది. రాత్రి 9.30 గంటలకు రైలు షామ్లి, బల్వా మధ్య చేరుకున్నప్పుడు, రైల్వే ట్రాక్‌పై రాళ్ళు, సిమెంట్ పైపులు, ఇనుప పైపులు పడి ఉండటం చూసి, లోకో పైలట్ అత్యవసర బ్రేక్‌లు వేసి RPF, GRPకి సమాచారం ఇచ్చాడు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఆర్‌పిఎఫ్, జిఆర్‌పి, ఎస్పీ రామ్ సేవక్ గౌతమ్ తదితరులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
Also Read:Vemulawada : ఆగని రాజన్న కోడెల మృత్యు ఘోష.. మరో ఐదు కోడెల మృతి
ట్రాక్ పై నుంచి రాళ్లు, ఇనుప పైపులు, సిమెంట్ పైపులను తొలగించారు. ప్రస్తుతం, ఆర్పీఎఫ్ గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసింది. నిందితుల కోసం గాలిస్తున్నారు. రైళ్లు ప్రయాణిస్తున్నప్పుడు రైల్వే ట్రాక్‌ల చుట్టూ భద్రతను పెంచారు. ఆదివారం ఉదయం అనేక రైళ్లు ప్రయాణించేటప్పుడు ఆర్‌పిఎఫ్, జిఆర్‌పి అప్రమత్తంగా ఉన్నాయి.