ఢిల్లీ నుంచి షామ్లీ మీదుగా సహారన్‌పూర్ వెళ్తున్న రైలుకు పెను ప్రమాదం తప్పింది. బల్వా-షామ్లి రైల్వే మార్గంలో ట్రాక్‌పై సిమెంట్, ఇనుప పైపులను ఉంచి రైలు ప్రమాదానికి కుట్రపన్నారు దుండగులు. లోకో పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న ఆర్‌పిఎఫ్, జిఆర్‌పి సంఘటన స్థలానికి చేరుకుని స్థానిక పోలీసులకు కూడా సమాచారం అందించారు. గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైలు చాలా సేపు అడవిలో నిలిచి ఉండటంతో ప్రయాణికులు…