Asim Munir: అసిమ్ మునీర్ వింత ఆలోచన.. డ్రోన్ల కట్టడికి వెరైటీ ప్లాన్
- అసిమ్ మునీర్ వింత ఆలోచన
- డ్రోన్ల కట్టడికి వెరైటీ ప్లాన్
- రక్షణ నిపుణుల విమర్శలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ప్రణాళిక ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆప్ఘనిస్థాన్ సరిహద్దులో డ్రోన్ల ముప్పు ఎదుర్కొనేందుకు విచిత్రమైన ప్లాన్ వేశారు. ఖైబర్ పఖ్తున్ఖ్వాలో తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్థాన్ (TTP) డ్రోన్ దాడులకు తెగబడుతోంది. ఈ నేపథ్యంలో దాడులను తిప్పికొట్టేందుకు సైనిక, పోలీసు చెక్‌పోస్టుల దగ్గర ఫిషింగ్ నెట్స్ (చేపలు పట్టే వలలు) ఏర్పాటు చేసింది. డ్రోన్ ముప్పును ఎదుర్కొనేందుకు ఈ చర్య చేపట్టినట్లు అల్ జజీరా నివేదిక పేర్కొంది. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌కు పశ్చిమ సరిహద్దుల్లో భద్రతా సవాళ్లు పెరుగుతున్న సమయంలో ఈ చర్య ప్రాధాన్యం సంతరించుకుంది. ఖరీదైన యాంటీ-డ్రోన్ వ్యవస్థలకు బదులుగా తక్కువ ఖర్చుతో ఫిషింగ్ నెట్స్‌ను ఏర్పాటు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
అసలు ఏం జరిగింది?
అల్ జజీరా కథనం ప్రకారం.. ఏప్రిల్ 16న హంగూ జిల్లాలో జరిగిన డ్రోన్ దాడి తర్వాత ఫిషింగ్ నెట్స్‌ను ఏర్పాటు చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. ఆ ప్రాంతం ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుకు సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సర్కీ పయాలా పోలీస్ చెక్‌పోస్ట్‌ను డ్రోన్లు లక్ష్యంగా చేసుకున్నాయి. ఆ తర్వాత TTP మిలిటెంట్లు కాల్పులు జరిపినట్లు సమాచారం. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. ఈ ఏడాది హంగూ జిల్లాలోనే 16 డ్రోన్ దాడులు జరిగినట్లు అల్ జజీరా పేర్కొంది. డ్రోన్ల ముప్పు కారణంగా భద్రతా సిబ్బంది బ్యారక్స్ వెలుపల తమ కదలికలను కూడా పరిమితం చేసుకుంటున్నట్లు నివేదిక తెలిపింది.
Also Read
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
- Saudi-India: ‘అప్రమత్తంగా ఉండండి.. ఇంట్లోనే ఉండండి’.. సౌదీలోని భారతీయులకు కేంద్రం సూచన
- Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్‌లింక్‌పై మస్క్ సంచలన ప్రశ్న!
- Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
డ్రోన్లను అడ్డుకునేందుకు సాధారణంగా ఉపయోగించే ఖరీదైన యాంటీ-డ్రోన్ వ్యవస్థలకు బదులుగా పాకిస్థాన్ ఇప్పుడు ఫిషింగ్ నెట్స్‌ను ఉపయోగిస్తోంది. చెక్‌పోస్టుల చుట్టూ ఉన్న భవనాల పైకప్పులు, ప్రహరీ గోడల మధ్య ఈ వలలను బిగిస్తున్నారు. డ్రోన్ చెక్‌పోస్ట్‌పైకి వచ్చే సమయంలో వలలో చిక్కుకుని దాని ప్రొపెల్లర్లు పనిచేయకుండా పోతాయన్నది అధికారుల అంచనా. కోహట్, కరాక్, బన్నూ, లక్కీ మార్వత్, డేరా ఇస్మాయిల్ ఖాన్ ప్రాంతాల్లోని పలు సైనిక అవుట్‌పోస్టుల వద్ద ఈ నెట్స్‌ను ఏర్పాటు చేసినట్లు సమాచారం.
ఖర్చులో భారీ తేడా
ఫిషింగ్ నెట్స్‌ను ఉపయోగించడానికి ప్రధాన కారణం తక్కువ ఖర్చు. ఒక చెక్‌పోస్ట్‌ను ఫిషింగ్ నెట్స్‌తో కప్పేందుకు సుమారు 1,400 డాలర్లు ఖర్చవుతుందని అల్ జజీరా తెలిపింది. అదే సమయంలో యాంటీ-డ్రోన్ వ్యవస్థల ధరలు సుమారు 5,000 డాలర్ల నుంచి 50 లక్షల డాలర్ల వరకు ఉండొచ్చని నివేదిక పేర్కొంది. దీంతో పరిమిత వనరులతో డ్రోన్ ముప్పును ఎదుర్కొనేందుకు పాకిస్థాన్ అధికారులు తక్కువ ఖర్చుతో కూడిన మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. డ్రోన్ ఫిషింగ్ నెట్లోకి దూసుకెళ్తే.. దాని ప్రొపెల్లర్లు వలలో చిక్కుకునే అవకాశం ఉంటుంది. దీంతో డ్రోన్ గాల్లోనే ఆగిపోవచ్చు లేదా దాని కదలికలు దెబ్బతినవచ్చు. ఒకవేళ డ్రోన్ వలలో చిక్కుకోకుండా దాని పైనే పేలినా.. పేలుడు శకలాలు నేరుగా నేలపై పడకుండా గాల్లోనే చెదిరిపోయే అవకాశం ఉండటంతో నష్టం కొంత మేర తగ్గవచ్చని తెలిపింది. అయితే ఈ విధానం పూర్తిస్థాయి రక్షణ కల్పించదని పాకిస్థాన్ అధికారులు కూడా అంగీకరిస్తున్నారు.
నిపుణుల విమర్శలు
ఫిషింగ్ నెట్స్ ఏర్పాటు చేయడంపై రక్షణ నిపుణులు కూడా సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అన్ని పోలీస్ స్టేషన్లు లేదా చెక్‌పోస్టులే డ్రోన్ల ప్రధాన లక్ష్యాలు కావని.. ప్రముఖ ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని పెద్ద ఎత్తున ప్రభావం చూపించడమే మిలిటెంట్ల ఉద్దేశమై ఉండొచ్చని సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ సెక్యూరిటీ స్టడీస్‌కు చెందిన ఇమ్తియాజ్ గుల్ అభిప్రాయపడ్డారు. డ్రోన్లను ప్రయోగించిన వెంటనే వాటిని గుర్తించి అడ్డుకునే సామర్థ్యాన్ని పాకిస్థాన్ పెంచుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!