Site icon NTV Telugu

Asia Cup 2025: కౌంట్ డౌన్ స్టార్.. లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా?

India Squad Asia Cup 2025

India Squad Asia Cup 2025

Asia Cup 2025 Live Streaming on Star Sports and JioCinema: ఆసియా కప్ 2025 కోసం భారత జట్టును బీసీసీఐ నేడు ప్రకటించనుంది. భారత క్రికెట్ జట్టులో ఎవరుంటారో అనే నిరీక్షణకు నేడు తెరపడనుంది. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌ ఈరోజు మధ్యాహ్నం 1.30కు జట్టును ప్రకటించనున్నారు. జట్టు ఎంపిక కోసం ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో సెలెక్టర్ల సమావేశం జరుగుతుంది. బీసీసీఐ సమావేశం తర్వాత చీఫ్ సెలెక్టర్ అగార్కర్, కెప్టెన్‌ సూర్యకుమార్ యాదవ్ విలేకరుల సమావేశంలో పాల్గొననున్నారు.

చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ప్రెస్ మీట్ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. జియో హాట్‌స్టార్‌లో కూడా లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉంటుంది. ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్‌ కోసం మంగళవారం భారత మహిళా క్రికెట్ జట్టును కూడా ప్రకటిస్తారు. ఇదే జట్టు మహిళల వన్డే ప్రపంచ కప్‌లో ఆడనుంది. రెండు మేజర్ టోర్నీలకు బీసీసీఐ ఈరోజు టీమ్స్ ప్రకటించనున్నా నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. మహిళల జట్టుపై కాస్త క్లారిటీ ఉన్నా.. పురుషుల జట్టులో పోటీ తీవ్రంగా ఉంది. దాంతో జట్టులో ఎవరుంటారో అని అందరూ ఎదురుచూస్తున్నారు.

Also Read: Gold Rate Today: శుభవార్త.. భారీగా దిగొస్తున్న బంగారం ధరలు! నేటి గోల్డ్ రేట్స్ ఇవే

కొన్ని సంవత్సరాలుగా భారత జట్టులో మూడు ఫార్మాట్‌లలో వేర్వేరు ఆటగాళ్లు ఆడుతున్నారు. సూర్యకుమార్ యాదవ్‌ టీ20 ఫార్మాట్‌కు కెప్టెన్‌గా ఉన్నాడు. రోహిత్ శర్మ వన్డే సారథిగా ఉండగా.. శుభ్‌మాన్ గిల్ టెస్ట్ కెప్టెన్‌గా ఉన్నాడు. గిల్ నాయకత్వంలో భారత జట్టు ఇటీవల ఇంగ్లండ్‌లో అద్భుత ప్రదర్శన చేసింది. ఇంగ్లండ్‌లో రాణించిన గిల్‌కు టీ20 జట్టులో చోటు లభిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ గిల్‌ను టీ20 జట్టులోకి తీసుకోవాలా వద్దా అనేది చర్చనీయాంశంగా మారింది. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి. శ్రేయస్‌ అయ్యర్‌, సాయి సుదర్శన్, మహమ్మద్ సిరాజ్ లాంటి స్టార్లకు చోటు కష్టమే అని తెలుస్తోంది.

Exit mobile version