Asia Cup 2025: ఆసియా కప్‌లో భారత క్రికెట్ జట్టు అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తోంది. ఇప్పటికే మూడు మ్యాచ్‌ల్లో వరుస విజయాలు సాధించి సూపర్ ఫోర్స్‌కు దూసుకెళ్లింది. ఈరోజు పాకిస్తాన్‌తో జరిగే కీలకమైన సూపర్ ఫోర్ మ్యాచ్ కోసం టీమ్ ఇండియా సిద్ధమవుతోంది. ఈ మ్యాచ్‌కు ముందు భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ, “మేము ఉత్తమంగా ఏమి చేయగలమో దానిపై దృష్టి పెడుతున్నాం. గత రెండు మూడు మ్యాచ్‌లలో మేము అనుసరిస్తున్న మంచి అలవాట్లన్నింటినీ పాటించాలని అనుకుంటున్నాం. ఒక్కో మ్యాచ్‌పైనే మా దృష్టిని కేంద్రీకరిస్తున్నాం” అని అన్నారు.
ఈ టోర్నమెంట్‌లో భారత్, పాకిస్తాన్ తలపడటం ఇది రెండోసారి. గ్రూప్ A లో జరిగిన గత మ్యాచ్‌లో భారత్ పాకిస్తాన్‌ను 7 వికెట్ల తేడాతో ఓడించి ఆధిపత్యం చాటుకుంది. ఇప్పుడు, మరోసారి ఇరు జట్లు దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో తలపడనున్నాయి. ఈ మ్యాచ్ గెలిచి టోర్నమెంట్‌లో తమ జైత్రయాత్రను కొనసాగించాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్‌కు చేరువవుతుంది. ఇక నేటి లైవ్ అప్డేట్స్ ను ఇక్కడ చూసేద్దాం..
-
పాకిస్థాన్ పై భారత్ ఘన విజయం
ఆసియా కప్ 2025 సూపర్ ఫోర్ లో భాగంగా భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో భారత్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ 74 పరుగులతో లీడింగ్ స్కోరర్ గా నిలిచాడు.
-
ఇక విజయానికి 9 పరుగులే
18వ ఓవర్ ముగిసే సమయానికి భారత్ స్కోర్ 163/4. హార్దిక్ పాండ్య (6), తిలక్ వర్మ (20) పరుగులతో క్రీజులో ఉన్నారు.
-
18 బంతుల్లో 19 పరుగులు
17వ ఓవర్ ముగిసే సమయానికి భారత్ స్కోర్ 153/4. హార్దిక్ పాండ్య (4), తిలక్ వర్మ (12) పరుగులతో క్రీజులో ఉన్నారు.
-
సంజు శాంసన్ అవుట్
13 పరుగులు చేసిన అభిషేక్ శర్మ అవుట్. హరీష్ రాఫ్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అవుట్ అయ్యాడు. భారత్ స్కోర్ 148/4
-
విజయం చేరువలో భారత్.
16వ ఓవర్ ముగిసే సమయానికి భారత్ స్కోర్ 140/3. సంజు శాంసన్ (13), తిలక్ వర్మ (9) పరుగులతో క్రీజులో ఉన్నారు.
-
విజయం ముంగిట భారత్.
15వ ఓవర్ ముగిసే సమయానికి భారత్ స్కోర్ 140/3. సంజు శాంసన్ (9), తిలక్ వర్మ (8) పరుగులతో క్రీజులో ఉన్నారు.
-
విజయానికి ఇక 40 పరుగులే
14వ ఓవర్ ముగిసే సమయానికి భారత్ స్కోర్ 132/3. సంజు శాంసన్ (8), తిలక్ వర్మ (2) పరుగులతో క్రీజులో ఉన్నారు.
-
42 బంతుల్లో 46 పరుగులు అవసరం
13వ ఓవర్ ముగిసే సమయానికి భారత్ స్కోర్ 126/3. సంజు శాంసన్ (2), తిలక్ వర్మ (2) పరుగులతో క్రీజులో ఉన్నారు.
-
అభిషేక్ శర్మ అవుట్
39 బంతుల్లో 74 పరుగులు చేసి అభిషేక్ శర్మ అవుట్. ఆబ్రార్ అహ్మద్ బౌలింగ్ లో హరీష్ రాఫ్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. భారత్ స్కోర్ 123/3
-
విజయం దిశగా భారత్
12వ ఓవర్ ముగిసే సమయానికి భారత్ స్కోర్ 117/2. అభిషేక్ శర్మ(68), తిలక్ వర్మ (1) పరుగులతో క్రీజులో ఉన్నారు.
-
గేమ్ లోకి తిరిగి వచ్చిన పాకిస్థాన్
11వ ఓవర్ ముగిసే సమయానికి భారత్ స్కోర్ 106/2. అభిషేక్ శర్మ(58), తిలక్ వర్మ (0) పరుగులతో క్రీజులో ఉన్నారు.
-
సూర్యకుమార్ యాదవ్ డకౌట్
ఖాతా తెరవకుండానే టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అవుట్. హరీష్ రాఫ్ బౌలింగ్ లో ఆబ్రార్ అహ్మద్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. భారత్ స్కోర్ 106/2
-
ఇక విజయానికి 67 పరుగులే..
పదవ ఓవర్ ముగిసే సమయానికి భారత్ స్కోర్ 105/1. అభిషేక్ శర్మ(57), సూర్యకుమార్ యాదవ్ (0) పరుగులతో క్రీజులో ఉన్నారు.
-
మొదటి వికెట్ కోల్పోయిన భారత్
47 పరుగులు చేసిన శుభమన్ గిల్ ఫహీమ్ అష్రాఫ్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. భారత్ స్కోర్ 105/1
-
100 పరుగులు పూర్తి చేసిన భారత్
తోమ్మిదవ ఓవర్ ముగిసే సమయానికి భారత్ స్కోర్ 101/0. అభిషేక్ శర్మ(56), శుభమన్ గిల్ (44) పరుగులతో క్రీజులో ఉన్నారు.
-
ఓపనర్స్ ఆన్ ఫైర్
ఎనిమిదవ ఓవర్ ముగిసే సమయానికి భారత్ స్కోర్ 96/0. అభిషేక్ శర్మ(53), శుభమన్ గిల్ (42) పరుగులతో క్రీజులో ఉన్నారు.
-
అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ
24 బంతులతో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ పూర్తి.
-
సిక్సర్లతో రెచ్చిపోయిన అభిషేక్ శర్మ
ఏడవ ఓవర్ ముగిసే సమయానికి భారత్ స్కోర్ 85/0. అభిషేక్ శర్మ(48), శుభమన్ గిల్ (36) పరుగులతో క్రీజులో ఉన్నారు.
-
చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ
టీం ఇండియా ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ అభిషేక్ శర్మ పాకిస్థాన్‌పై చరిత్ర సృష్టించాడు. అతను T20I లలో 50 సిక్సర్లు కొట్టాడు. ప్రపంచంలోనే అతి తక్కువ ఇన్నింగ్స్‌లలో ఈ ఘనత సాధించిన తొలి బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. అతను 21 మ్యాచ్‌లలో 20 ఇన్నింగ్స్‌లలో 50 సిక్సర్లు కొట్టాడు.
-
ముగిసిన పవర్ ప్లే
ఆరవ ఓవర్ ముగిసే సమయానికి భారత్ స్కోర్ 69/0. అభిషేక్ శర్మ(33), శుభమన్ గిల్ (35) పరుగులతో క్రీజులో ఉన్నారు.
-
50 పరుగులు పూర్తి చేసుకున్న భారత్
ఐదో ఓవర్ ముగిసే సమయానికి భారత్ స్కోర్ 55/0. అభిషేక్ శర్మ(28), శుభమన్ గిల్ (27) పరుగులతో క్రీజులో ఉన్నారు.
-
దూకుడుగా ఆడుతున్న టీంఇండియా
నాల్గవ ఓవర్ ముగిసే సమయానికి భారత్ స్కోర్ 43/0. అభిషేక్ శర్మ(21), శుభమన్ గిల్ (22) పరుగులతో క్రీజులో ఉన్నారు.
-
క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన అభిషేక్
మూడో ఓవర్ ముగిసే సమయానికి భారత్ స్కోర్ 31/0. అభిషేక్ శర్మ(10), శుభమన్ గిల్ (21) పరుగులతో క్రీజులో ఉన్నారు.
-
వరుస బౌండరీలతో చెలరేగిన శుభమన్
రెండవ ఓవర్ ముగిసే సమయానికి భారత్ స్కోర్ 19/0. అభిషేక్ శర్మ(9), శుభమన్ గిల్(10) పరుగులతో క్రీజులో ఉన్నారు.
-
సిక్సర్ తో ఇన్నింగ్స్ మొదలు
మొదటి బంతికే సిక్సర్ కొట్టిన అభిషేక్ శర్మ. మొదటి ఓవర్ ముగిసే సమయానికి భారత్ స్కోర్ 9/0. అభిషేక్ శర్మ(8), శుభమన్ గిల్(1) పరుగులతో క్రీజులో ఉన్నారు.
-
ముగిసిన పాకిస్తాన్ ఇన్నింగ్స్.
నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసిన పాకిస్తాన్. 58 పరుగులతో ఆదుకున్నసాహిబ్జాదా ఫర్హాన్. టీమిండియా టార్గెట్ 172.
-
మరో క్యాచ్ మిస్
19వ ఓవర్ ముగిసే సమయానికి పాకిస్థాన్ 157/5. క్రీజ్ లో ఫహీమ్ అష్రాఫ్ (8), సల్మాన్ అఘా(16)
-
నవాజ్ అవుట్.. ఐదో వికెట్ కోల్పోయిన పాకిస్థాన్
సూర్య కుమార్ యాదవ్ త్రోకు అనుకోని విధంగా మొహమ్మద్ నవాజ్ 21 పరుగుల వద్ద అవుట్.
-
ధారాళంగా పరుగులు ఇచ్చిన దుబే
18వ ఓవర్ ముగిసే సమయానికి పాకిస్థాన్ 146/4. క్రీజ్ లో మొహమ్మద్ నవాజ్ (20), సల్మాన్ అఘా(15)
-
దూకుడు పెంచిన స్పిన్నర్లు
17వ ఓవర్ ముగిసే సమయానికి పాకిస్థాన్ 129/4. క్రీజ్ లో మొహమ్మద్ నవాజ్ (7), సల్మాన్ అఘా(11)
-
దూకుడు పెంచిన స్పిన్నర్లు
16వ ఓవర్ ముగిసే సమయానికి పాకిస్థాన్ 121/4. క్రీజ్ లో మొహమ్మద్ నవాజ్ (7), సల్మాన్ అఘా(3)
-
డేంజర్ బ్యాట్సమెన్ సాహిబ్జాదా ఫర్హాన్ అవుట్..
15వ ఓవర్ ముగిసే సమయానికి పాకిస్థాన్ 119/4. క్రీజ్ లో మొహమ్మద్ నవాజ్ (6), సల్మాన్ అఘా(2)
-
నాల్గవ వికెట్ కోల్పోయిన పాకిస్థాన్
శివమ్ దుబే బౌలింగ్ లో సూర్య కుమార్ యాదవ్ కి క్యాచ్ ఇచ్చి 58 పరుగులు చేసిన సాహిబ్జాదా ఫర్హాన్ అవుట్. పాకిస్థాన్ స్కోర్ 116/4
-
కుల్దీప్ ఈజ్ బ్యాక్.. మూడో వికెట్ డౌన్
14వ ఓవర్ ముగిసే సమయానికి పాకిస్థాన్ 115/3. క్రీజ్ లో సాహిబ్జాదా ఫర్హాన్ (58), మొహమ్మద్ నవాజ్ (4)
-
కుల్దీప్ స్ట్రైక్.. మూడో వికెట్ డౌన్
కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో వరుణ్ చక్రవర్తికి క్యాచ్ ఇచ్చి 10 పరుగులు చేసిన హుస్సేన్ తలత్ అవుట్. పాకిస్థాన్ స్కోర్ 110/3
-
నెమ్మదించిన పాక్ బ్యాటర్ల స్పీడ్
13వ ఓవర్ ముగిసే సమయానికి పాకిస్థాన్ 110/2. క్రీజ్ లో సాహిబ్జాదా ఫర్హాన్ (58), హుస్సేన్ తలత్ (10)
-
క్రీజ్ లో పాతుకపోయిన సాహిబ్జాదా ఫర్హాన్
12వ ఓవర్ ముగిసే సమయానికి పాకిస్థాన్ 103/2. క్రీజ్ లో సాహిబ్జాదా ఫర్హాన్ (56), హుస్సేన్ తలత్ (6).
-
భారీ పార్టనర్షిప్ కు బ్రేక్
11వ ఓవర్ ముగిసే సమయానికి పాకిస్థాన్ 96/2. క్రీజ్ లో సాహిబ్జాదా ఫర్హాన్ (53), హుస్సేన్ తలత్ (2)
-
హమ్మయ్య.. రెండో వికెట్ డౌన్
శివమ్ దూబే బౌలింగ్ లో అభిషేక్ శర్మకు క్యాచ్ ఇచ్చి 21 పరుగులు చేసిన ఫఖర్ జమాన్ అవుట్. పాకిస్థాన్ స్కోర్ 93/2
-
ఫర్హాన్ హాఫ్ సెంచరీ
పదవ ఓవర్ ముగిసే సమయానికి పాకిస్థాన్ 91/1. క్రీజ్ లో సైమ్ అయూబ్ (21), సాహిబ్జాదా ఫర్హాన్ (52).
-
సిక్సర్లతో చెలరేగిన ఫర్హాన్, అయూబ్
తొమ్మిదవ ఓవర్ ముగిసే సమయానికి పాకిస్థాన్ 83/1. క్రీజ్ లో సైమ్ అయూబ్ (20), సాహిబ్జాదా ఫర్హాన్ (45).
-
ఫిఫ్టీ పార్టనర్షిప్
ఎనిమిదో ఓవర్ ముగిసే సమయానికి పాకిస్థాన్ 70/1. క్రీజ్ లో సైమ్ అయూబ్ (13), సాహిబ్జాదా ఫర్హాన్ (39).
-
రంగంలోకి స్పిన్నర్లు
ఏడో ఓవర్ ముగిసే సమయానికి పాకిస్థాన్ 60/1. క్రీజ్ లో సైమ్ అయూబ్ (11), సాహిబ్జాదా ఫర్హాన్ (31).
-
స్కోర్ బోర్డును పరుగెత్తిస్తున్న పాక్ బ్యాటర్లు
ఆరో ఓవర్ ముగిసే సమయానికి పాకిస్థాన్ 55/1. క్రీజ్ లో సైమ్ అయూబ్ (9), సాహిబ్జాదా ఫర్హాన్ (29).
-
నిలకడగా పాక్ బ్యాటింగ్
ఐదో ఓవర్ ముగిసే సమయానికి పాకిస్థాన్ 42/1. క్రీజ్ లో సైమ్ అయూబ్ (5), సాహిబ్జాదా ఫర్హాన్ (20).
-
ఆచితూచి ఆడుతున్న పాక్ బ్యాటర్స్
నాల్గవ ఓవర్ ముగిసే సమయానికి పాకిస్థాన్ 36/1. క్రీజ్ లో సైమ్ అయూబ్ (4), సాహిబ్జాదా ఫర్హాన్ (15).
-
ఫస్ట్ బ్రేక్ వచ్చేసింది
మూడో ఓవర్ ముగిసే సమయానికి పాకిస్థాన్ 26/1. క్రీజ్ లో సైమ్ అయూబ్ (4), సాహిబ్జాదా ఫర్హాన్ (6).
-
మొదటి వికెట్ కోల్పోయిన పాక్
హార్దిక్ పాండ్య బౌలింగ్ లో కీపర్ శాంసన్ కు క్యాచ్ ఇచ్చి 15 పరుగులు చేసిన ఫఖర్ జమాన్ అవుట్. పాకిస్థాన్ స్కోర్ 21/1.
-
దూకుడు పెంచిన పెంచిన పాక్
రెండో ఓవర్ ముగిసే సమయానికి పాకిస్థాన్ 17/0. క్రీజ్ లో ఫఖర్ జమాన్ (11), సాహిబ్జాదా ఫర్హాన్ (6).
-
భారత బౌలింగ్ కు ధీటుగా పాక్ బ్యాటింగ్
పాకిస్థాన్ మొదటి ఓవర్‌లో 6/0. క్రీజ్ లో ఫఖర్ జమాన్ (0*), సాహిబ్జాదా ఫర్హాన్ (6*).
