Asia Cup 2025: ఆసియా కప్‌లో భారత క్రికెట్ జట్టు అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తోంది. ఇప్పటికే మూడు మ్యాచ్‌ల్లో వరుస విజయాలు సాధించి సూపర్ ఫోర్స్‌కు దూసుకెళ్లింది. ఈరోజు పాకిస్తాన్‌తో జరిగే కీలకమైన సూపర్ ఫోర్ మ్యాచ్ కోసం టీమ్ ఇండియా సిద్ధమవుతోంది. ఈ మ్యాచ్‌కు ముందు భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ, “మేము ఉత్తమంగా ఏమి చేయగలమో దానిపై దృష్టి పెడుతున్నాం. గత రెండు మూడు మ్యాచ్‌లలో మేము అనుసరిస్తున్న మంచి అలవాట్లన్నింటినీ పాటించాలని…