Asia Cup 2025: పాకిస్థాన్ పై భారత్ ఘన విజయం!
- పాకిస్థాన్ పై భారత్ 6 వికెట్ల తేడాతో గెలుపు.
- అభిషేక్ శర్మ (74), గిల్ (47) మెరుపు ఇన్నింగ్స్
- కొనసాగిన భారత్ విజయ జైత్రయాత్ర.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asia Cup 2025: ఆసియా కప్‌లో భారత్ తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన సూపర్ ఫోర్స్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను భారత్ 6 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ విజయంతో టీమ్ ఇండియా టోర్నమెంట్‌లో తమ నాలుగో విజయాన్ని నమోదు చేసుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. పాక్ బ్యాటర్లలో సాహిబ్‌జాదా ఫర్హాన్ 45 బంతుల్లో 58 పరుగులు చేసి రాణించాడు. ఫాఖర్ జమాన్ (15), సైమ్ అయూబ్ (21), మహమ్మద్ నవాజ్ (21) ఫర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో శివమ్ దూబే 33 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్ చెరో వికెట్ పడగొట్టారు.
Suicide : వేధింపులు తట్టుకోలేక స్కూల్ టీచర్ ఆత్మహత్య
Also Read
- Rajya Sabha Candidates: టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు.. చివరి నిమిషంలో చింతకాయల విజయ్ పేరు ఖరారు!
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- Vaibhav's Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్ ఇండియా కేవలం 18.5 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్ జట్టుకు మెరుపు ఆరంభం ఇచ్చారు. అభిషేక్ శర్మ 39 బంతుల్లో 74 పరుగులు చేయగా, గిల్ 28 బంతుల్లో 47 పరుగులు చేశాడు. వీరిద్దరూ మొదటి వికెట్‌కు 105 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే, ఆ తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ డకౌట్ కావడం, అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (13) త్వరగా ఔటవడంతో కొద్దిగా ఒత్తిడి పెరిగింది. కానీ, తిలక్ వర్మ (30 నాటౌట్), హార్దిక్ పాండ్యా (7 నాటౌట్) నిలకడగా ఆడి మరో 7 బంతులు మిగిలి ఉండగానే జట్టును విజయతీరాలకు చేర్చారు. పాక్ బౌలర్లలో హరీస్ రవూఫ్ రెండు వికెట్లు తీశాడు.
PAK vs IND: పాకిస్థాన్‌కి కలిసొచ్చిన క్యాచ్ డ్రాప్స్.. టీమిండియాకు భారీ టార్గెట్!
తాజావార్తలు
-
Mega 158 : చిరు సరసన నటించేందుకు బాలయ్య హీరోయిన్ నో..
-
Vaibhav Sooryavanshi-BCCI: అసలు వైభవ్ సూర్యవంశీ మా ప్రణాళికల్లోనే లేడు.. పెద్ద బాంబ్ పేల్చిన బీసీసీఐ!
-
TVS 160cc Maxi Scooter: టీవీఎస్ 160cc మ్యాక్సీ స్కూటర్.. యమహా ఏరాక్స్, హీరో జూమ్‌లకు గట్టి పోటీ
-
Rajya Sabha Candidates: టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు.. చివరి నిమిషంలో చింతకాయల విజయ్ పేరు ఖరారు!
-
Sai Durgha Tej : సాయి దుర్గ తేజ్ నెక్ట్స్ సినిమా టైటిల్ ‘పార్వేట’
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!