Asia Cup 2025: ఆసియా కప్‌లో భారత్ తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన సూపర్ ఫోర్స్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను భారత్ 6 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ విజయంతో టీమ్ ఇండియా టోర్నమెంట్‌లో తమ నాలుగో విజయాన్ని నమోదు చేసుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. పాక్ బ్యాటర్లలో సాహిబ్‌జాదా ఫర్హాన్ 45 బంతుల్లో 58 పరుగులు…