PAK vs IND: పాకిస్థాన్‌కి కలిసొచ్చిన క్యాచ్ డ్రాప్స్.. టీమిండియాకు భారీ టార్గెట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PAK vs IND: దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఆసియా కప్ సూపర్ 4 మ్యాచ్‌లో పాకిస్థాన్, భారత్ తలపడ్డాయి. ఇక మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో పాకిస్థాన్ మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఇక పాకిస్థాన్ బ్యాటింగ్ ఇన్నింగ్స్‌లో సాహిబ్‌జాదా ఫర్హాన్ 45 బంతులలో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 58 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ ఫఖర్ జమాన్ వేగంగా పరుగులు చేసినా హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో తొలి వికెట్‌గా వెనుదిరిగాడు.
Alcohol and Weight Gain: అధిక బరువు ఉన్న వాళ్లు మద్యం తాగితే ఏం జరుగుతుంది..? షాకింగ్ నిజాలు..
Also Read
ఆ తర్వాత సాయిమ్ ఆయుబ్ (21), హుస్సేన్ తలత్ (10) లు ఆచితూచి ఆడారు. కానీ శివం దూబే, కులదీప్ యాదవ్ వరుస వికెట్లతో పాకిస్థాన్‌ను ఒత్తిడిలోకి నెట్టారు. కానీచివరి ఓవర్లలో సల్మాన్ ఆఘా (17*) ఫహీమ్ అష్రఫ్ (20*) ధనాధన్ బ్యాటింగ్‌తో స్కోరును 171/5కు చేర్చారు. వీరికి తోడుగా మొహమ్మద్ నవాజ్ (21) కూడా మంచి సహకారం అందించాడు. ఇక భారత బౌలర్లలో శివం దూబే అద్భుతంగా రాణించాడు. అతను 4 ఓవర్లలో 33 పరుగులిచ్చి 2 కీలక వికెట్లు తీసుకున్నాడు. కులదీప్ యాదవ్ 4 ఓవర్లలో 31 పరుగులిచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. హార్దిక్ పాండ్యా 3 ఓవర్లలో 29 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నారు. అయితే జస్ప్రీత్ బుమ్రా 4 ఓవర్లలో ఏకంగా 45 పరుగులు ఇచ్చినా వికెట్ తీసుకోలేకపోయారు. మరోవైపు భారత ఫీల్డర్లు అనేక క్యాచ్ లు వదిలేయడంతో పాకిస్థాన్ భారీ స్కోర్ అందుకుంది.
OG : ఆ హీరోయిన్ ను నెత్తిన పెట్టుకుంటున్న పవన్ ఫ్యాన్స్.. ఎందుకంటే..?
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!