Site icon NTV Telugu

Asia Cup 2025: పాకిస్థాన్ పై భారత్ ఘన విజయం!

Ind Vs Pak

Ind Vs Pak

Asia Cup 2025: ఆసియా కప్‌లో భారత్ తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన సూపర్ ఫోర్స్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను భారత్ 6 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ విజయంతో టీమ్ ఇండియా టోర్నమెంట్‌లో తమ నాలుగో విజయాన్ని నమోదు చేసుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. పాక్ బ్యాటర్లలో సాహిబ్‌జాదా ఫర్హాన్ 45 బంతుల్లో 58 పరుగులు చేసి రాణించాడు. ఫాఖర్ జమాన్ (15), సైమ్ అయూబ్ (21), మహమ్మద్ నవాజ్ (21) ఫర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో శివమ్ దూబే 33 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్ చెరో వికెట్ పడగొట్టారు.

Suicide : వేధింపులు తట్టుకోలేక స్కూల్ టీచర్ ఆత్మహత్య

172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్ ఇండియా కేవలం 18.5 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్ జట్టుకు మెరుపు ఆరంభం ఇచ్చారు. అభిషేక్ శర్మ 39 బంతుల్లో 74 పరుగులు చేయగా, గిల్ 28 బంతుల్లో 47 పరుగులు చేశాడు. వీరిద్దరూ మొదటి వికెట్‌కు 105 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే, ఆ తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ డకౌట్ కావడం, అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (13) త్వరగా ఔటవడంతో కొద్దిగా ఒత్తిడి పెరిగింది. కానీ, తిలక్ వర్మ (30 నాటౌట్), హార్దిక్ పాండ్యా (7 నాటౌట్) నిలకడగా ఆడి మరో 7 బంతులు మిగిలి ఉండగానే జట్టును విజయతీరాలకు చేర్చారు. పాక్ బౌలర్లలో హరీస్ రవూఫ్ రెండు వికెట్లు తీశాడు.

PAK vs IND: పాకిస్థాన్‌కి కలిసొచ్చిన క్యాచ్ డ్రాప్స్.. టీమిండియాకు భారీ టార్గెట్!

Exit mobile version