Rohit Sharma: రోహిత్ శర్మ డకౌట్.. టీమిండియా సారథి ఖాతాలో చెత్త రికార్డ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆసియా కప్ 2023 టోర్నీ సూపర్-4 రౌండ్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా 17 పరుగులకే కీలక రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. వరుసగా మూడు మ్యాచుల్లో హాఫ్ సెంచరీలు చేసి, జోరు మీదున్న కనిపించిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, కొత్త కుర్రాడు తంజీమ్ హసన్ షేక్ బౌలింగ్‌లో అనమోల్ హక్‌కి క్యాచ్ ఇచ్చి డకౌట్ గా పెవిలియన్ కు చేరుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో వరుసగా 28 ఇన్నింగ్స్‌లు డబుల్ డీజిట్ స్కోర్లు చేస్తూ వచ్చిన రోహిత్ శర్మ, ఇవాళ్టి మ్యాచ్‌లో దాన్ని అందుకోలేకపోయాడు.
Read Also: Changure Bangaru Raja Review: ఛాంగురే బంగారురాజా రివ్యూ
Also Read
ఆసియా కప్ చరిత్రలో మూడుసార్లు డకౌట్ అయిన మొట్టమొదటి టీమిండియా ప్లేయర్‌గా చెత్త రికార్డును రోహిత్ శర్మ మూటకట్టుకున్నాడు. ఇంతకుముందు భువనేశ్వర్ కుమార్, హార్ధిక్ పాండ్యా రెండేసి సార్లు డకౌట్ కాగా.. ఆసియా కప్ చరిత్రలో డకౌట్ అయిన రెండో భారత కెప్టెన్‌గా రోహిత్ నిలిచాడు. ఇంతకు ముందు 1988 ఆసియా కప్ ఎడిషన్‌లో అప్పటి భారత కెప్టెన్ దిలీప్ వెంగ్‌సర్కార్ డకౌట్ అయ్యాడు.. అంతర్జాతీయ క్రికెట్‌లో రోహిత్ శర్మకు ఇది 29వ డకౌట్ అయ్యాడు. టాపార్డర్‌లో అత్యధిక సార్లు డకౌట్ అయిన నాలుగో భారత ప్లేయర్‌గా నిలిచాడు.
Read Also: Health Tips: ఆహారం విషయంలో ఈ పొరపాట్లు చేస్తే.. ప్రమాదాలను కొని తెచ్చుకున్నట్లే..!
సచిన్ టెండూల్కర్ 34, విరాట్ కోహ్లీ 33, వీరేంద్ర సెహ్వాగ్ 31 సార్లు డకౌట్ కాగా, రోహిత్ శర్మ కంటే ముందున్నారు. అలాగే ఆసియా కప్‌లో రెండు సార్లు డకౌట్ అయిన భారత ఓపెనర్ కూడా రోహిత్ శర్మనే నిలిచాడు. ఇంతకు ముందు ఏ భారత ఓపెనర్ కూడా రెండు సార్లు డకౌట్ కాలేదు.. విరాట్ కోహ్లీ స్థానంలో తుది జట్టులో చోటు దక్కించుకున్న తెలుగు కుర్రాడు తిలక్ వర్మ ఆరంగ్రేటం వన్డేలో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. 9 బంతుల్లో ఓ ఫోర్‌తో 5 రన్స్ చేసిన తిలక్ వర్మ, తంజీమ్ హసన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.
తాజావార్తలు
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
-
Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
-
PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
-
Festive Sale: పండుగ షాపింగ్ తుఫాన్.. 48 గంటల్లో రూ.24,000 కోట్ల సేల్స్!
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!