PM Modi on Ravichandran Ashwin: టీమిండియా ఆఫ్ స్పిన్ మాంత్రికుడు రవిచంద్రన్ అశ్విన్ తన క్రికెట్ కెరీర్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించడం సంచలనం రేపింది. అశ్విన్ క్రికెట్‌లో అద్భుతమైన రికార్డులను సృష్టించారు. ఆయన ఆఫ్ స్పిన్‌లో ఒక స్పెషల్ టాలెంట్‌గా పేరు తెచ్చుకున్నారు. కానీ, బార్డర్-గావస్కర్ ట్రోఫీ మధ్యలో అశ్విన్ సడన్ గా ఈ నిర్ణయం తీసుకోవడం అన్ని అనుమానాలను కలిగించింది. బ్రిస్బేన్ టెస్ట్ తర్వాత అశ్విన్ తన రిటైర్మెంట్ ప్రకటన చేసినప్పుడు, భారత డ్రెస్‌రూమ్ లో ఉన్న సహచరులు కూడా అశ్విన్ ఈ నిర్ణయాన్ని ఎందుకు తీసుకున్నారో అర్థం చేసుకోలేకపోయారు. భారత ప్రధాని నరేంద్ర మోడి కూడా ఈ వార్తపై ఆశ్చర్యపోయారు. ఆయన అశ్విన్ రిటైర్మెంట్ ను ఉద్దేశించి, ఒక భావోద్వేగపూర్వకమైన లేఖలో అశ్విన్ యొక్క భారత క్రికెట్‌లో చేసిన ప్రముఖ కృషి గురించి అభినందించారు.
Also Read: Honda Activa 125cc: కొత్త లుక్‌తో ఆక్టివా 125 స్కూటర్.. ఫీచర్లు ఇలా
ప్రధాని మోదీ తన లేఖలో, అశ్విన్ కేవలం భారత క్రికెట్ కోసం ముఖ్యమైన ఆటగాడు కాకుండా, యువ ఆటగాళ్లకు ఒక ప్రేరణగా నిలిచారని పేర్కొన్నారు. అశ్విన్ జర్నీ స్ఫూర్తిగా వారి అభివృద్ధి, కష్టపడి సాధించిన విజయాలు, ఇంకా ఎంతో సాహసంతో చేసిన కృషి గురించి మోడీ ప్రస్తావించారు. ప్రధాన మంత్రి మోడీ అశ్విన్ సాధించిన 765 అంతర్జాతీయ వికెట్ల అనేక విశేషాలు గుర్తు చేశారు. ఇందులో ప్రతీ వికెట్ ఒక గొప్ప కృషి అని ఆయన అన్నారు. అశ్విన్ టెస్ట్ మ్యాచ్‌లలో “ప్లేరు ఆఫ్ ది సిరీస్” అవార్డులను అద్భుతంగా అందుకున్నప్పటి తన ఆటగాళ్ళ టెస్టు క్రికెట్ పై గాఢమైన ప్రభావాన్ని చూపినట్లు చెప్పారు.
Also Read: Huge Discount On iPhone 15 Plus: ఐఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఆ ఫోన్‌పై బిగ్ డిస్కౌంట్ డీల్స్
అశ్విన్ భారత క్రికెట్‌కు చేసిన కృషి అంతా అద్భుతం అంటూ ప్రధాని మోడీ తన అభిప్రాయాన్ని తెలిపారు. ఆశ్విన్ భవిష్యత్తులో మంచి ప్రయాణం సాగాలని కోరుకుంటున్నట్లు ఆయన అన్నారు. అశ్విన్ ఈ నిర్ణయం తీసుకోవడంతో, భారత క్రికెట్ ప్రపంచం కూడా ఆశ్చర్యపోయింది. మరి ఆయన కెరీర్‌కు ఒక చివరి దశలో ఉన్నప్పటికీ, వీలైనంత కాలం క్రికెట్ లో అశ్విన్ ప్రభావం కొనసాగుతుందని భావించవచ్చు.