టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ ఇంట పెళ్లి సందడి మొదలైంది.. దిల్ రాజ్ తమ్ముడు శిరీష్ కొడుకు ఆశిష్ ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.. రౌడీ బాయ్స్ సినిమాతో ప్రేక్షకులను అలరించాడు.. ఆశిష్ రౌడీ బాయ్స్ అనే సినిమా తో తెలుగు ఆడియన్స్ కు పరిచయం అయ్యాడు.. ప్రస్తుతం తన రెండో సినిమాని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఈలోపే పెళ్లి చేసుకొని ఓ ఇంటివాడు కాబోతున్నారు..
గత ఏడాది నవంబర్ లో కుటుంబ సభ్యుల మధ్య గ్రాండ్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. ఏపీకి చెందిన ఓ ప్రముఖ వ్యాపారవేత్త కూతురు అయిన అద్విత రెడ్డితో ఆశిష్ ఏడడుగులు వేయబోతున్నారు. ఇక ఎంగేజ్మెంట్ కార్యక్రమాన్ని సింపుల్ గా చేసేసుకున్న ఆశిష్, పెళ్లి మాత్రం చాలా గ్రాండ్ గా చేసుకోబోతున్నాడు.. ఈ క్రమంలో సినీ ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులను అందరిని ఆహ్వానిస్తున్నారు..
తన కొడుకు పెళ్లి బాధ్యతలను తానే స్వయంగా చూసుకుంటున్నాడు దిల్ రాజ్. పెళ్లి పిలుపులను మొదలుపెట్టి ఒక్కొక్కర్ని కలుసుకుంటూ ఆహ్వాన పత్రిక అందిస్తూ వస్తున్నారు. మొన్న మెగాస్టార్ చిరంజీవికి మొదటి పెళ్లి పత్రికను అందజేశారు. ఈ క్రమంలోనే ఇప్పుడు గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ ను కలిశారు. ఆశిష్ పెళ్లి శుభలేఖని దిల్ రాజు, శిరీష్ కలిసి అందించారు. ఇక ఇందుకు సంబంధించిన ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.. ఆశిష్ సినిమాల విషయానికొస్తే.. రెండో సినిమాగా సెల్ఫిష్’ అనే చిత్రాన్ని సిద్ధం చేస్తున్నారు. ‘లవ్ టుడే’ ఫేమ్ ఇవానా హీరోయిన్ గా నటిస్తున్నారు. దర్శకుడు సుకుమార్ శిష్యుడు కాశి ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ దాదాపు కంప్లీట్ అయిందని సమాచారం. మూడో సినిమా కొత్త డైరెక్టర్ అరుణ్ తో చేయబోతున్నాడు..