Asha Bhosle: లెజెండరీ సింగర్ ఆశా భోస్లేకు గుండెపోటు.. బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో 92 ఏళ్ల సింగర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asha Bhosle: ఇండియన్ సినీ సంగీత ప్రపంచంలో తన గాత్రంతో దశాబ్దాల పాటు ఓ వెలుగు వెలిగిన లెజెండరీ సింగర్ ఆశా భోస్లే (92) శనివారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆమెకు గుండెపోటు రావడంతో వెంటనే ముంబైలోని ప్రముఖ బ్రీచ్ క్యాండీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె అక్కడ అత్యవసర వైద్య విభాగం (ICU)లో చికిత్స పొందుతున్నట్లు సమాచారం.
READ ALSO: Ayush Mhatre ‘రిటైర్డ్ ఔట్’.. CSK వ్యూహం వెనుక అసలు కారణం ఇదే..!
Also Read
ఆసుపత్రి వర్గాల సమాచారం ప్రకారం.. ఆశా భోస్లే ప్రముఖ వైద్యుడు ప్రతి సంధానీ పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆశా భోస్లే కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో ఉన్నారు. ఈ వార్త తెలియడంతో ఆమె త్వరగా కోలుకోవాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంగీత ప్రియులు, సినీ ప్రముఖులు ప్రార్థిస్తున్నారు. దివంగత గాయని లతా మంగేష్కర్ సోదరిగా మ్యూజిక్ వరల్డ్‌లోకి అడుగుపెట్టిన ఆశా భోస్లే, తనదైన శైలితో సొంత ముద్ర వేసుకున్నారు. 1950వ దశకంలో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన ఆమె, వేల సంఖ్యలో పాటలు పాడారు. 1952లో ‘సంగ్దిల్’ చిత్రంతో గుర్తింపు పొందిన ఆమె, ఆ తర్వాత ‘పరిణీత’, ‘బూట్ పాలిష్’ వంటి సినిమాలతో అగ్ర దర్శకుల దృష్టిని ఆకర్షించారు.
మహమ్మద్ రఫీతో కలిసి ఆమె పాడిన “మాంగ్ కే సాథ్ తుమ్హారా,” “సాథీ హాత్ బధానా”, “ఉదేన్ జబ్ జబ్ జుల్ఫెన్ తేరీ” వంటి పాటలు నేటికీ ఎవర్‌గ్రీన్ హిట్స్. ఆర్.డి. బర్మన్ సంగీత దర్శకత్వంలో ఆశా భోస్లే పాడిన పాటలు ఒక ట్రెండ్ సెట్ చేశాయి. “ఆజా ఆజా,” “పియా తూ అబ్ తో ఆజా,” “యే మేరా దిల్” వంటి డ్యాన్స్ నంబర్లతో ఆమె అప్పట్లోనే సంచలనం సృష్టించారు. ఆశా భోస్లే కేవలం కమర్షియల్ పాటలకే పరిమితం కాలేదు. గజల్స్ పాడి జాతీయ అవార్డులను సైతం అందుకున్నారు. 90వ దశకంలో ‘రంగీలా’ చిత్రంతో కుర్రకారును ఉర్రూతలూగించిన ఆమె, ఇటీవలే 91 ఏళ్ల వయసులో దుబాయ్ కచేరీలో “తౌబా తౌబా” వంటి ట్రెండింగ్ సాంగ్స్ పాడి ‘జెన్ జీ’ (Gen Z) మనసులను కూడా గెలుచుకున్నారు. సంగీత సామ్రాజ్ఞిగా కీర్తి పొందిన ఆశా భోస్లే మళ్లీ సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ఆస్పత్రి నుంచి బయటికి రావాలని ఆమె అభిమానులందరూ కోరుకుంటున్నారు.
READ ALSO: Peanut Chikki: వంటరాని వారు కూడా ‘సింపుల్’గా చేసే పర్ఫెక్ట్ పల్లిపట్టి.. ఇలా చేయండి!
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు