Ayush Mhatre ‘రిటైర్డ్ ఔట్’.. CSK వ్యూహం వెనుక అసలు కారణం ఇదే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ayush Mhatre Retired Out: చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన చెన్నై సూపర్ కింగ్స్ (CSK) వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ (DC) మ్యాచ్‌లో ఓ అరుదైన ఘటన చోటుచేసుకుంది. 18 ఏళ్ల చెన్నై జట్టు బ్యాటర్ ఆయుష్ మాత్రే అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో, సీఎస్‌కే టీమ్ మేనేజ్మెంట్ అతడిని ‘రిటైర్డ్ ఔట్’ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. మాత్రే 36 బంతుల్లో 59 పరుగులతో ఉన్న సమయంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అతడు టచ్ ప్లేయర్‌గా మంచి ఇన్నింగ్స్ ఆడుతున్నప్పటికీ, చివరి ఓవర్లలో మరింత వేగంగా పరుగులు సాధించేందుకు సీఎస్‌కే వ్యూహాత్మకంగా ఈ నిర్ణయం తీసుకుంది.
CSK vs DC: సంజు శాంసన్ షాందార్ సెంచరీ.. ఢిల్లీ క్యాపిటల్స్ ముందు భారీ లక్ష్యం!
Also Read
- Bhakthi Anniversary Special: రెండు దశాబ్దాల ఆధ్యాత్మిక ప్రయాణం.. భక్తి టీవీ ప్రత్యేక గీతం మీకోసం.!
- Bhopal Murder: భర్త, భార్య, ప్రియురాలు, మాజీ ప్రియుడు.. ఈ హత్య కేసులో ట్విస్టులే ట్విస్టులు!
- మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో 'కాజూ కట్లీ' తయారీ చేయండి ఇలా.!
- Asim Munir: పాకిస్థాన్ మళ్లీ యుద్ధానికి సిద్ధమవుతోందా? ఆయుధ కర్మాగారాన్ని సందర్శించిన మునీర్..
కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ నేతృత్వంలోని టీమ్ మేనేజ్మెంట్ డెత్ ఓవర్లలో భారీ షాట్లు ఆడగల శివమ్ దూబేను క్రీజ్‌లోకి పంపింది. ఈ నిర్ణయం వెనుక ఉద్దేశం స్పష్టంగా కనిపించింది. డ్యూబే క్రీజ్‌లోకి వచ్చిన తర్వాత వేగంగా పరుగులు సాధించడంతో జట్టు స్కోర్ మరింత పెరిగింది. మాత్రే పావిలియన్‌కి తిరిగి వెళ్లే సమయంలో జట్టు సభ్యులు, సపోర్ట్ స్టాఫ్ అతడికి స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వడం ప్రత్యేకంగా నిలిచింది.
ఈ దెబ్బతో ఐపీఎల్ చరిత్రలో ‘రిటైర్డ్ ఔట్’ అయిన ఆటగాళ్ల జాబితాలో మాత్రే కూడా చేరాడు. ఇంతకు ముందు రవిచంద్రన్ అశ్విన్, సాయి సుదర్శన్, తిలక్ వర్మ, డెవాన్ కాన్వే వంటి ప్రముఖులు ఈ జాబితాలో ఉన్నారు. నిజానికి క్రికెట్‌లో ‘రిటైర్డ్ హర్ట్’, ‘రిటైర్డ్ ఔట్’ అనే రెండు పదాలు ఉంటాయి. ‘రిటైర్డ్ హర్ట్’ అంటే గాయాల కారణంగా ఆటగాడు మైదానం విడిచిపెట్టడం. కానీ ‘రిటైర్డ్ ఔట్’ అనేది జట్టు ప్రయోజనాల కోసం స్వచ్ఛందంగా మైదానం విడిచిపెట్టడం.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే సంజు శాంసన్ అద్భుత సెంచరీతో సీఎస్‌కేకు భారీ స్కోర్ అందించాడు. 56 బంతుల్లో 115 పరుగులు (15 ఫోర్లు, 4 సిక్సర్లు) చేసి అజేయంగా నిలిచాడు. దీంతో సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 212/2 భారీ స్కోర్ నమోదు చేసింది. దుబే చివర్లో 10 బంతుల్లో 20 పరుగులు చేసి జట్టు స్కోర్ 200 దంతెనందుకు సహకరించాడు. ఢిల్లీ బౌలర్లలో అక్షర్ పటేల్ ఒక వికెట్ మాత్రమే తీశాడు.
తాజావార్తలు
-
India’s New Time Rule: ISTపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. దేశవ్యాప్తంగా కొత్త టైమ్ రూల్స్.. ఎప్పటినుంచంటే?
-
Billionaire Web Series: విజయ్ మాల్యా కథతో అర్జున్ రాంపాల్.. నవంబర్‌లో షూటింగ్
-
Bhakthi Anniversary Special: రెండు దశాబ్దాల ఆధ్యాత్మిక ప్రయాణం.. భక్తి టీవీ ప్రత్యేక గీతం మీకోసం.!
-
GV Prakash : సుధా కొంగర సినిమాకు నో చెప్పిన మహేశ్ బాబు
-
Bhopal Murder: భర్త, భార్య, ప్రియురాలు, మాజీ ప్రియుడు.. ఈ హత్య కేసులో ట్విస్టులే ట్విస్టులు!
ట్రెండింగ్
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్‌ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!