NTV Telugu Site icon

Asaduddin Owaisi : అల్లా మా రూలర్.. అల్లా కోసమే ఉన్నాం.. అల్లా కోసమే పని చేస్తున్నాం..

Asaduddin Owaisi

Asaduddin Owaisi

జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా ఎంఐఎం బహిరంగ సభ నిర్వహించింది. మాసాబ్ ట్యాంక్ హాకీ గ్రౌండ్ లో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిధిగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ హాజరయ్యారు. సభకు ముందు ఎంఐఎం తిరంగా బైక్ ర్యాలీ నిర్వహించింది. నాంపల్లి దర్గా నుంచి లక్డికాపూల్ హాకీ స్టేడియం వరకు ఈ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ.. ఆర్ఎస్ఎస్, సంఘ్ పరివార్ బీజేపీలు హైదరాబాద్ సంస్థానాన్ని దేశంలో సమైక్యం చేసేటప్పుడు ఎక్కడున్నాయి.? అని ఆయన ప్రశ్నించారు. ముస్లింలు పర్సెంటేజ్ పరంగా తక్కువగా ఉన్న అందరిని కలుపుకుని పోతామని ఆయన అన్నారు. నిజాం కాలంలో కట్టినవే ఇంకా హైదరాబాద్ లో ప్రముఖంగా ఉన్నాయని, హై కోర్ట్, ఉస్మానియా హాస్పిటల్ లాంటివన్నీ నిజాం కట్టినవే అని ఆయన అన్నారు. హైదరాబాద్ ను కలపడానికి పోలీస్ చర్య జరిగిందని, పండిట్ సుందర్ లాల్ ఇచ్చిన నివేదికలో ముస్లింలపై జరిగిన ఘటనలు వివరించారన్నారు. రజాకార్ల ఏరివేత పేరుతో ముస్లింలపై దారుణాలు చేశారు.. ఈ ఘటనలు నివేదికలో ఉన్నాయని, ఈరోజు హైదరాబాద్ కు అమిత్ షా వచ్చారు.. అబ్బధాలు చెప్పారన్నారు అసదుద్దీన్‌.

Also Read : IND vs SL Final: ఫైనల్‌లో శ్రీలంకను చిత్తుగా ఓడించిన టీమిండియా.. భారత్ బౌలర్లు మెరుపు దాడి

అంతేకాకుండా..’బీజేపీ పాత్ర ఏముందని వేడుకలు చేస్తున్నారు.? హైదరాబాద్ గురించి అమిత్ షా మాట్లాడుతున్నారు.. నిజాం, రజాకార్లు అంటున్నాడు చరిత్ర తెలియంది మాట్లాడుతున్నారు.. చేసిందేం లేదు కానీ మేమే చేస్తున్నాం అని చెప్తున్నాడు.. అమిత్ షా ని అడుగుతున్నాను.. అప్పుడు చెడ్డి వేసుకుంటుండే.. ఇప్పుడెందుకు ప్యాంట్ వేసుకుంటున్నారు.. ( ఆర్ఎస్ఎస్ ను ఉద్దేశించి.. ). 95 శాతం చేసిన వారి దగ్గరికి వచ్చి ఐదు శాతం చేసి అంతా మేమే చేశాం అంటే ఎలా.? అల్లా మా రూలర్, అల్లా కోసమే ఉన్నాం, అల్లా కోసమే పని చేస్తున్నాం.. హర్యానాలోని నూహ్ లో జరిగింది ఏంటి.? ఎంతో మంది ఇళ్లను కాల్చేస్తున్నారు.. సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ అంటున్నారు ఇదేనా.? దేశంలో జరుగుతుంది చూస్తే తెలుస్తుంది.! కాంగ్రెస్ బిజెపిలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ముస్లింలకు ఏం చేస్తున్నాయి.. కాంగ్రెస్ బీజేపీలు మజ్లీస్ కు అంటాయి కానీ ముస్లింలకు చేసింది చెప్పవు.. తెలంగాణలో ముస్లిం పిల్లలకు హాస్టల్స్ ఉన్నాయి.. మెడికల్ సీట్స్ వస్తున్నాయి.. దారుసలాం అసదుద్దీన్ ది కాదు మీది.. దారుసలాంకు ఎవరైనా రావచ్చు.. దేశంలోని ఎవరైనా రావచ్చు..’ అని అసదుద్దీన్‌ వ్యాఖ్యానించారు.

Also Read : Kushi: ఖుషీ ఓటిటీలోకి వచ్చేస్తుంది.. ఎప్పుడంటే..?