వారణాసికి చెందిన జ్ఞాన్వాపి మసీదుకు చెందిన ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా నివేదికలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. హిందూవుల తరపు న్యాయవాది విష్ణు శంకర్ జైన్ మాట్లాడుతూ.. ప్రస్తుత కట్టడాన్ని నిర్మించడానికి ముందు అక్కడ పెద్ద హిందూ దేవాలయం ఉండేదని ఏఎస్ఐ చెప్పినట్లు పేర్కొన్నారు. ఏఎస్ఐ రిపోర్టు పబ్లిక్‌గా మారినప్పటి నుంచి జ్ఞాన్వాపీ వ్యవహారం హీటెక్కింది. ఈ మొత్తం వ్యవహారంపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ రియాక్ట్ అయ్యారు. ఏఎస్ఐ నివేదికను తోసిపుచ్చారు.. ఈ నివేదిక కేవలం ఊహాగానాల ఆధారంగానే ఉంది.. ఇది శాస్త్రీయ అధ్యయనాన్ని అపహాస్యం చేయడమేనంటూ ఆయన మండిపడ్డారు.
Read Also: NTPC 2024: ఎన్టీపీసీలో 223 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. జీతం ఎంతంటే?
ప్రస్తుతం ఉన్న కట్టడాన్ని నిర్మించక ముందే అక్కడ హిందూ దేవాలయం ఉండేదని ఏఎస్ఐ సర్వేలో పేర్కొంది. ఈ నివేదిక ఏ ప్రొఫెషనల్ ఆర్కియాలజిస్టులు లేదా చరిత్రకారుల ముందు అకడమిక్ పరిశీలనకు నిలబడదన్నారు. నివేదిక ఊహాగానాలపై ఆధారపడిందని.. శాస్త్రీయ అధ్యయనాలను అపహాస్యం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా హిందూత్వ బానిసగా మారిపోయిందంటూ ఓవైసీ ఆరోపించారు.
Read Also: CM Revanth Reddy: తెలంగాణ CM రేవంత్ నివాసంలో రిపబ్లిక్ డే వేడుకలు..
ఇక, హిందూ దేవాలయం స్తంభాలతోనే ప్రస్తుత మసీదు నిర్మించారని పురావస్తు శాఖ అధికారుల సర్వేలో తేలిందని హిందూపక్షం న్యాయవాది జైన్ తెలిపారు. మసీదు దక్షిణ భాగంలని గోడ, హిందూ ఆలయానికి చెందినదనే అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఆలయానికి సంబంధించిన శిల్పాలను కాస్త చెక్కి మళ్లీ మసీదు నిర్మాణంలో ఉపయోగించారని హిందూపక్షం లాయర్ వెల్లడించారు. ఆలయ నిర్మాణానికి సంబంధించి 34 కీలక శాసనధారాలు లభ్యమైనట్లు చెప్పుకొచ్చారు. జనార్థన, రుద్ర, ఉమేశ్వర పేర్లతో ఈ శాసనాలు లభ్యమైనట్లు సర్వేలో వెల్లడైంది.. ఇవి దేవనాగరి, తెలుగు, కన్నడ భాషల్లో ఉన్నట్లు న్యాయవాది విష్ణు శంకర్ జైన్ చెప్పారు.