కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. ఇప్పటికే పలు సంస్థల్లో ఉన్న ఖాళీలను పూర్తి చేసింది.. ఇప్పుడు మరో సంస్థలో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం ఎన్‌టీపీసీలో 223 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.. అర్హతలు, జీతం వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంజినీరింగ్ డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ జనవరి 25న ప్రారంభమైంది. సరైన అర్హతలున్నవారు ఫిబ్రవరి 8 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. అప్లికేషన్ స్క్రీనింగ్, షార్ట్లిస్టింగ్, సెలెక్షన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు..
పోస్టుల వివరాలు..
పోస్టుల కేటాయింపు:యూఆర్-98, ఈడబ్ల్యూఎస్-22, ఓబీస-40, ఎస్సీ-39, ఎస్టీ-24.
అర్హతలు..
బీఈ, బీటెక్ (ఎలక్ట్రికల్/ మెకానికల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి..
వయోపరిమితి..
35 సంవత్సరాలు మించకూడదు.
దరఖాస్తు ఫీజు:రూ.300. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్మెన్, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది..
ఎంపిక విధానం..
అప్లికేషన్ స్క్రీనింగ్, షార్ట్లిస్టింగ్, సెలెక్షన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా.
జీత భత్యాలు..
నెలకు రూ.55,000.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 08.02.2024.
ఈ పోస్టుల గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడం కోసం అధికార వెబ్ సైట్ ను సందర్శించగలరు..