Arvind Kejriwal: ఛత్తీస్‌గఢ్‌కు అరవింద్ కేజ్రీవాల్ హామీల వర్షం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arvind Kejriwal: ఛత్తీస్‌గఢ్‌లో రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పలు పార్టీలు ఇప్పటికే ప్రచార జోరును పెంచాయి. ఛత్తీస్‌గఢ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ అడుగుపెట్టాలని జోరుగా అడుగులు వేస్తోంది. ఆ రాష్ట్రానికి ఆప్ వరాల జల్లు కురిపించింది. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వస్తే 10 లక్షల మంది నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని, 300 యూనిట్ల వరకూ గృహ అవసరాల కోసం వినియోగించే విద్యుత్‌ను ఉచితంగా అందిస్తామని ఆప్ హామీలు కురిపించింది. మహిళలకు నెలవారీ `సమ్మాన్ రాశి’, నిరుద్యోగులకు రూ.3,000 నెలవారీ భృతి సహా పది హామీలు ప్రకటించారు. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో జరిగిన ఆప్ కార్యకర్తల సదస్సులో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రసంగిస్తూ.. ఢిల్లీ, పంజాబ్‌లలో తమ పార్టీ ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాయని, ఛత్తీస్‌గఢ్‌లో అధికారంలోకి వస్తే అదే పని చేస్తామని చెప్పారు.
ఆప్ హామీలివే..
Also Read
- HMD Vibe2 Pro: 64ఎంపీ సోనీ కెమెరా, 6000mAh బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్.. HMD కొత్త 5G ఫోన్.. అక్టోబర్ 8న లాంచ్..
- Ketan Agarwal Case: కేతన్ హత్య 5 వేల పేజీల ఛార్జిషీట్.. పిచ్చిగా ప్రేమించిన కేతన్, హత్య చేసిన సియా..
- Lava Smart Phone: 6000mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్.. లావా నుంచి బడ్జెట్ ధరలో స్మార్ట్ ఫోన్ లాంచ్..
- Student Protests: రేప్ నుంచి దెయ్యం వరకు.. పుకార్లతో రగిలిపోతున్న యూనివర్సిటీలు.!
*10 లక్షల మంది నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు
*24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా
*ప్రతి ఇంటికి 300 యూనిట్ల వరకు ఉచితం
*నవంబర్ 2023 వరకు పెండింగ్ విద్యుత్ బిల్లుల మాఫీ
*18 ఏళ్లు పైబడిన మహిళలందరికీ నెలవారీ రూ.1,000 ‘సమ్మన్ రాశి’ (గౌరవ వేతనం)
*పిల్లలందరికి ఉచిత విద్య
*ఢిల్లీ తరహాలో ఛత్తీస్‌గఢ్‌లోని ప్రతి పౌరునికి ఉచిత, మెరుగైన ఆరోగ్య చికిత్స
*ప్రతి గ్రామం, నగరాల్లోని వార్డులలో మొహల్లా క్లినిక్‌లు
*నిరుద్యోగులకు రూ.3,000 నెలవారీ భృతి
*సీనియర్ సిటిజన్‌లకు ఉచిత తీర్థయాత్ర,
*విధి నిర్వహణలో అమరులైన రాష్ట్ర పోలీసు సిబ్బంది, ఆర్మీ జవాన్ల (ఛత్తీస్‌గఢ్‌కు చెందినవారు) కుటుంబాలకు రూ. కోటి అందజేత
*కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్
తదుపరి హామీలు రైతులకు, గిరిజనులకు సంబంధించినదేనని అయితే తదుపరి పర్యటనలో వెల్లడిస్తానని చెప్పారు. అరవింద్ కేజ్రీవాల్ వెంట ఆప్ నేత, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఉన్నారు.అరవింద్ కేజ్రీవాల్ గత నెలలో బిలాస్‌పూర్‌లో జరిగిన బహిరంగ ర్యాలీలో ప్రసంగించారు. మార్చిలో రాయ్‌పూర్‌లో జరిగిన ఆప్ కార్యకర్తల సదస్సుకు ఆయన హాజరయ్యారు. 2018లో ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ తొలిసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. 90 స్థానాలకు 85 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టింది, కానీ విజయం సాధించలేకపోయింది.
తాజావార్తలు
-
CDSCO: పదేపదే ట్యాబ్లెట్లు వాడుతున్నారా?
-
HMD Vibe2 Pro: 64ఎంపీ సోనీ కెమెరా, 6000mAh బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్.. HMD కొత్త 5G ఫోన్.. అక్టోబర్ 8న లాంచ్..
-
Ketan Agarwal Case: కేతన్ హత్య 5 వేల పేజీల ఛార్జిషీట్.. పిచ్చిగా ప్రేమించిన కేతన్, హత్య చేసిన సియా..
-
Explainer: మరిన్ని విపత్తులు తప్పవా?
-
Lava Smart Phone: 6000mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్.. లావా నుంచి బడ్జెట్ ధరలో స్మార్ట్ ఫోన్ లాంచ్..
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!