ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యం సరిగ్గా లేనట్లు తెలుస్తుంది. ఆయన 4.5 కేజీల బరువు తగ్గిపోయారు. మార్చి 21వ తేదీన ఆయనను లిక్కర్ స్కామ్ కేసులో కేసులో ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన తీహార్ జైలులోని రెండవ సెల్‌లో ఉన్నారు. అయితే, కేజ్రీవాల్ బరువు తగ్గినట్లు ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కానీ జైలు అధికారులు మాత్రం అలాంటిది ఏమీ లేదని పేర్కొన్నారు. రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం.. ఏప్రిల్ 15వ తేదీ వరకు కేజ్రీవాల్ జుడిషియల్ రిమాండ్ లో ఉండనున్నారు.
Read Also: Hardik Pandya: సచిన్ ని విమర్శించి మరోసారి అభిమానులకు టార్గెట్ గా మారిన ‘పాండ్య’..!
కాగా, 14 X 8 ఫీట్ల వెడల్పు ఉన్న తీహార్ జైలులోని సెల్‌లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను బంధించారు. అయితే, బ్లడ్ షుగర్ లెవల్స్ క్రమంగా పెరుగుతున్నట్లు జైలు డాక్టర్లు వెల్లడించారు. ఓ దశలో 50 కన్నా తక్కువ షుగర్ నమోదు అయినట్లు నివేదికలో తెలిపారు. బ్లడ్ షుగర్ లెవల్స్ ను అదుపులో ఉంచేందుకు మెడిసిన్స్ ఇస్తున్నట్లు వైద్యులు చెప్పారు. లంచ్, డిన్నర్ కోసం ఆయనకు ఇంటి భోజనం పెడుతున్నట్లు తెలిపారు. కేజ్రీవాల్ కండీషన్‌ను డాక్టర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు. ఎమర్జెన్సీ కోసం ఆయన సెల్ దగ్గర క్విక్ రెస్పాన్స్ టీమ్ ను ఏర్పాటు చేశారు.