సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కోమటి చెరువు పట్టణానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ప్రతి ఆరు నెలలకు, ఇది మరింత ఆకర్షణీయంగా మారుతోంది. అయితే.. కోమటి చెరువు పై ఆహ్లదం పంచే.. అద్భుత ప్రపంచం డైనోసార్ థీమ్ పార్క్ పర్యటకులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. డైనోసార్ పార్క్ ను రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ కోమటి చెరువు ప్రాంతాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దినట్లు తెలిపారు . దీనికి తోడు కోమటి చెరువు వద్ద ఆర్టిఫీషియల్ బీచ్ ను త్వరలో ప్రారంభించబోతున్నట్లు మంత్రి హరీష్ రావు తెలిపారు.
Also Read : Maadhavi Latha: బిగ్ బాస్ లో వాళ్లని పెడితే .. ఎవడు దేకను కూడా దేకడు
రంగనాయక సాగర్ ను డెస్టినేషన్ సెంటర్ గా తీర్చిదిద్దుతున్నట్లు వెల్లడించారు మంత్రి హరీష్ రావు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపాల్ చైర్మన్ కడవేర్గు మంజుల రాజనర్సు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు శివమ్స్ గార్డెన్స్ లో నూతన ఆసరా పింఛన్ లబ్ధిదారులకు పింఛను మంజూరి ఉత్తర్వులను మంత్రి హరీష్ రావు పంపిణీ చేశారు. అంతకు ముందు కలెక్టరేట్ లో మంత్రి హరీష్ రావు బ్యాంకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈనెల 21 లోపు రైతు రుణమాపీ పూర్తి కావాలని సంబంధిత శాఖ అధికారులను మంత్రి హరీష్ రావు ఆదేశించారు. రెండు ట్రాన్స్‌జెండర్ల స్వయం సహాయక బృందాలకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకారంతో రుణ మంజూరు పత్రాలను మంత్రి హరీష్ రావు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు. టీఎన్జీవో భవనంలలో గురుపూజోత్సవం పురస్కరించుకొని ఉత్తమ ఉపాధ్యాయులను మంత్రి హరీష్ రావు సన్మానించారు.
Also Read : Maadhavi Latha: బిగ్ బాస్ లో వాళ్లని పెడితే .. ఎవడు దేకను కూడా దేకడు